09-07-2025 11:20:24 PM
ఇల్లందు జేకే కాలనీలో విషాదం..
ఇల్లందు టౌన్ (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(Bhadradri Kothagudem District) ఇల్లందు మండలం దండ గుండాల గ్రామంలో ఈత కోసం వెళ్లి మృత్యువాత పడిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. ఇల్లందు జేకే కాలనీకి చెందిన విశ్రాంతి ఉద్యోగి లక్ష్మయ్య కుమారుడు కిరణ్(35) బుధవారం తన స్నేహితులతో కలిసి దండ గుండాలలోని గుట్టపై నుంచి వచ్చి నిల్వ ఉండే కొలనులోకి ఈతకు వెళ్ళాడు. నీటిలో మునిగిన కిరణ్ సుడిగుండంలో చిక్కుకోవడంతో మృత్యువాత పడ్డాడు. స్నేహితులు అతన్ని వెలికిలోకి తీసేలోపే ప్రాణం పోయింది. మృతదేహాన్ని ఇల్లెందు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇల్లందు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.