09-07-2025 11:32:41 PM
దీక్షను విరిమింపజేసిన ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, కాంగ్రెస్ నేత సురేందర్ రెడ్డి, ఆనంద్ గౌడ్, సిరాజ్ ఖాద్రీ..
మహబూబ్ నగర్ (విజయక్రాంతి): జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని న్యాయమైన ప్రతి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, కాంగ్రెస్ నేత సురేందర్ రెడ్డి, ఆనంద్ గౌడ్, సిరాజ్ ఖాద్రీ అన్నారు. గత 17 రోజులుగా జర్నలిస్టుల ఇండ్లు ఇండ్ల స్థలాల సాధన కోసం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్(Telangana Working Journalists Federation) ఆధ్వర్యంలో చేస్తున్న దీక్ష శిబిరం దగ్గరికి కాంగ్రెస్ నేతలు చేరుకొని ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించడం జరిగిందని ప్రతి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చి దీక్షను విరమింప చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... మాకు జర్నలిస్టులంతా సమానమేనని, మనం ఎన్నో సంవత్సరాలుగా అన్నదమ్ములుగా కలిసి ఉన్నామని మీ కష్టాలు సమస్యలు తీర్చడం మా బాధ్యతన్నారు. ఈ కార్యక్రమంలో టిడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బండి విజయ్ కుమార్, ఫౌండర్ మంగళగిరి యాదగిరి, జిల్లా అధ్యక్షుడు వాకిట అశోక్ కుమార్, జిల్లా కార్యదర్శి గోపాల్, నేషనల్ కౌన్సిల్ సభ్యులు ఉమామహేశ్వరరావు, మొయిజు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు ఎండి రఫీ, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు పసుపుల శ్రీనివాస్, నాయకులు, మిత్ర న్యూస్ ఛానల్ సీఈవో యం వి రమణ, రమాకాంత్ రెడ్డి, కటిక రవీందర్, సతీష్ కుమార్, సుందర చారి, ఆనంద్, రాఘవేందర్, నిరంజన్, రవి, మిట్టమీది, బాలరాజ్, జగదీష్, అప్రోజు, ఖాజా, కృష్ణ, రాము, శివ, చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.