calender_icon.png 10 July, 2025 | 2:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలీస్ ప్రజా భరోసా కార్యక్రమం నిర్వహించిన ఎస్పీ

09-07-2025 11:26:32 PM

చివ్వేంల (విజయక్రాంతి): ఈరోజు చివ్వెంల పోలీస్ స్టేషన్(Chivvemla Police Station) పరిధి గుంజాలూరు గ్రామంలో నిర్వహించిన పోలీసు ప్రజా భరోసా కార్యక్రమం నందు జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్(District SP Narasimha IPS) ముఖ్యఅతిథిగా హాజరై గ్రామాల్లో ప్రశాంత వాతావరణం నెలకొల్పడం, చెడు నడవడిక కలిగిన వారిని చట్ట పరిధిలోకి తీసుకొచ్చి మార్పు తేవడం, నూతన చట్టాల అమలు, నేరాలకు పాల్పడితే శిక్షలు తప్పవు, గంజాయి వల్ల జరిగే అనర్ధాలు, వృద్ధుల పోషణ అనే అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ... మన రక్షణ కోసం ఏర్పాటు చేసుకున్న పోలీసు వ్యవస్థ ప్రజల కోసం అనునిత్యం పని చేస్తుందన్నారు.

గ్రామాలు పట్టణాలు కాలనీలలో ప్రశాంత వాతావరణ నెలకొల్పడం లక్ష్యంగా జిల్లాలో ప్రతి బుధవారం రోజున 8 గ్రామాలు ఎంచునుని ఈ పోలీసు ప్రజా భరోసా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. గ్రామాల్లో పెద్దమనుషులు ఆదర్శంగా ఉండాలి తప్పు ను తప్పు అని నిలదీయాలి అన్నారు, చట్టాన్ని ఉల్లంగించవద్దు అని కోరారు. భూమి సంభద సమస్యలు ఉంటే సామరస్యంగా పరిష్కరించుకోవాలి, సోదరభావం ఉండాలి ఎన్నికలు ఏవైనా మనం అందరం కలిసిక్టుగా ఉండాలి, గొడవలు పెట్టుకోవద్దు అన్నారు.  యువత బాగా చదువుకోవాలి, కష్టపడి చదువుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుంది, బాగా చదివి ఉన్నత స్థానానికి చేరిన వారిని అందరూ ఆదర్శంగా తీసుకుంటారు.

తద్వారా గ్రామం అభివృద్ధి చెందుతుంది, గ్రామంలో ప్రశాంత వాతావరణ నెలకొంటుంది అన్నారు. గ్రామంలో అలజడులు, అశాంతి కి, అక్రమ వ్యాపారాలకు పాల్పడే వారిని ఉపేక్షించం అన్నారు.  క్షణికావేశంలో, క్షేణిక ఆనందంకోసం తప్పులు, నేరాలు చేస్తే జీవితకాలం జైలు శిక్షలు అనుభవించాల్సి వస్తుంది అన్నారు. అత్యాశకు పోయి సైబర్ మోసగాళ్ళకు చిక్కితే ఆర్థికంగా లూటీ చేస్తారు, తక్కువ వడ్డీకి లోన్ వచ్చినది ప్రాసేసింగ్ ఫీజు కట్టాలి అంటే నమ్మి డబ్బులు చెల్లించవద్దు, మీరు డ్రగ్స్ కేసులో, ఇతర డిజిటల్ కేసులో చిక్కుకున్నారు అని CBI, CID పోలీస్ అధికారులం మాట్లాడుతున్నాను మిమ్ములను అరెస్టు చేస్తాము అని బయపెడతారు, కేసు నుండి తప్పిస్తం డబ్బులు కట్టాలి అంటారు భయపడి డబ్బులు కట్టవద్దు డిజిటల్ అరెస్టు అనేది అబద్ధం అన్నారు. యువత ఆదర్శంగా ఉంటూ భవిష్యత్తులో మంచి స్థాయికి చేరుకోవాలని ఎస్పి  అన్నారు.

మద్యం మత్తులో వాహనాలు నడపవద్దు రోడ్డు భద్రత చర్యలు తీసుకోవాలి, అజాగ్రత్తగా మద్యం మత్తులో, అధిక వేగం తో, నిర్లక్ష్యంగా వాహనాలు తొలడం వల్ల  రోడ్డు ప్రమాదాల  జరిగి ప్రాణాలు కోల్పోతున్నారు. మత్తు పదార్థాలకు బానిసలై యువత మంచి భవిష్యత్తును కోల్పోతుంది అన్నారు. జాగ్రత్తగా ఉండాలి చట్టానికి లోబడి ఉండాలి, సమస్యలు వస్తె సామరస్యంగా పరిష్కరించుకోవాలి, పోలీసులను, అధికారులను ఆశ్రయించాలి, చట్టాన్ని ఉల్లంఘిస్తే జైలుకు వెళ్లాల్సి వస్తుంది అన్నారు. అలవాటుగా నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయి, బైండోవర్ చేస్తాము, షీట్ నమోదు చేస్తాము అన్నారు. సామాజిక అంశాలపై పోలీసు కళాబృందం వారు పాట్లతో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట రూరల్  CI రాజశేఖర్,  స్థానిక SI మహేశ్వర్, SI లు కనకరత్నం, శ్రీకాంత్, గోపికృష్ణ , పోలీసు సిబ్బంది, గ్రామ పెద్దలు, యువత పాల్గొన్నారు.