27-07-2025 06:01:28 PM
ఏటూరునాగారం (విజయక్రాంతి): ములుగు జిల్లా(Mulugu District) ఏటూరునాగారంలో బీఆర్ఎస్ ములుగు జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబుని తమ నివాసంలో బీఆర్ఎస్ ములుగు జిల్లా నాయకులు బొట్ల కార్తీక్ మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్బంగా లక్ష్మణ్ బాబు మాట్లాడుతూ, స్థానిక ఎన్నికల్లో గ్రామ గ్రామాన బీఆర్ఎస్ జెండా ఎగరేయ్యాడానికి అందరం ఐక్యంగా పని చేయాలి అని అన్నారు. యువత రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనాలని సూచించారు. అనంతరం బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మాజీ ఐపీఎస్ అధికారి డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో లక్ష్మణ్ బాబు ఫోన్లో ములుగు జిల్లాలో ప్రస్తుత రాజకీయాల గురించి మాట్లాడటం జరిగింది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ యువజన నాయకులు వావిలాల కిషోర్ కుమార్ ఎంపెల్లి రాజు సతీష్ అనిల్ రాజు సారయ్య తదితరులు పాల్గొన్నారు.