calender_icon.png 27 July, 2025 | 9:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్కాలర్షిప్ నిధులు మంజూరు చేయాలి..

27-07-2025 06:05:05 PM

మంత్రి లక్ష్మణ్ కి ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో వినతిపత్రం..

దేవరకొండ: ఎస్ఎఫ్ఐ దేవరకొండ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో దేవరకొండ పట్టణానికి పలు అభివృద్ధి కార్యక్రమాలకు హాజరైన రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్(Minister Adluri Laxman Kumar)కి ఎస్ఎఫ్ఐ దేవరకొండ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ హాస్టల్ లో మౌలిక వసతులు కల్పించాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మంత్రికి వినతిపత్రం అందజేయడం జరిగింది.

ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ దేవరకొండ డివిజన్ కార్యదర్శి బుడిగ వెంకటేష్ మాట్లాడుతూ... రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ విద్యార్థుల పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ 8,150 కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉన్నాయని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ హాస్టల్లో మౌలిక వసతులు కొరకు అధిక నిధులు కేటాయించి విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు చీమట శివ, నక్క గణేష్, రాసమల్ల మహేష్ తదితరులు పాల్గొన్నారు.