calender_icon.png 27 July, 2025 | 11:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సేవ భావంతో వైద్య సేవలు అందించాలి..

27-07-2025 05:51:06 PM

వంద పడకల ఆసుపత్రిని విజిట్ చేసిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్..

రోగులతో మాట్లాడిన కలెక్టర్..

వైద్య సేవలు తీరుపై ఆరా..

బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ప్రభుత్వ వంద పడకల ఆసుపత్రిని ఆదివారం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్(District Collector Kumar Deepak) సందర్శించారు. ఆసుపత్రిలోనే ప్రతి వార్డులో రోగులను కలిసి వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. అడ్మిట్ అయి ఉన్న చిన్న పిల్లలకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. సీజనల్ వ్యాధులు పొంచి ఉన్న దృష్ట్యా ఆసుపత్రిలో శానిటేషన్ నిర్వహణపై నిర్లక్ష్యం ఉండరాదని ఆదేశించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. వైరల్ జ్వరాలు ప్రబలే ఈ తరుణంలో వైద్యులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా కుమార్ దీపక్ మాట్లాడారు.

వైద్యులు వైద్య సిబ్బంది రోగులకు సేవ భవంతో పని చేయాలన్నారు. మెరుగైన వైద్యం అందించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు. రోగులకు ఉన్నపలంగా ఏ లోటు లేకుండా వీలైనంత మేరకు వైద్య సదుపాయాలు ఆసుపత్రిలో అందుబాటులో ఉంటాయన్నారు. వంద పడక ఆసుపత్రిలో వైద్య సేవలపై రోగులు ఎలాంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు. ప్రస్తుతం ఆస్పత్రిలో వైద్య సేవలు మెరుగ్గానే ఉన్నాయని అన్నారు. ఇదే స్పూర్తితో వైద్యులు, వైద్య సిబ్బంది ముందుకెళ్లలన్నారు. ఆయన వెంట ఆసుపత్రి వైద్యులు సిబ్బంది ఉన్నారు.