21-11-2025 12:00:00 AM
అలంపూర్, నవంబర్ 20 : అలంపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ బాధ్యులు కాంగ్రెస్ నేత ఎఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్‌ను అయిజ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిశారు. గురువారం ఆయన జన్మదినం పురస్కరించుకొని హైదరాబాదులో సంపత్ ను కలిసి పూల బొకేలు అందజేసి శాలువాతో సత్కరించి అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
సంపత్ ను కలిసిన వారిలో రాష్ట్ర అధికార ప్రతినిధి మాస్టర్ షేక్షావలి ఆచారి, మాజీ సింగిల్ విండో అధ్యక్షులు సంకాపురం రాముడు, వినోద్ కుమార్ కేకే నాగరాజు గోపాలకృష్ణ యాదవ్ తదితరులు ఉన్నారు. అదేవిధంగా సంపత్ జన్మదిన సందర్భంగా నాయకులు మానవపాడు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు బ్రెడ్లు పండ్లను పంపిణీ చేశారు.
అనంతరం గాంధీ చౌక్ వద్ద ఏర్పాటుచేసిన కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొని స్వీట్లు పంచుకొని సంబరాలు చేశారు.ఈ కార్యక్రమంలో నాయకులు పరమేష్ ,శేఖర్ , మధు, మద్దిలేటి,మాలిక్, ప్రభాకర్, రవి, దండోరా శీను , మునగాల రవీందర్, తదితరులు పాల్గొన్నారు.