20-10-2025 01:10:47 AM
ఆమనగల్లు అక్టోబర్ 19 .డిసిసి అధ్యక్ష పదవి విషయంలో కల్వకుర్తి కాంగ్రెస్ నాయకులు ఏకాభిప్రాయానికి వచ్చారు. హైదరాబాద్ బాలాపూర్ లోని ఓ ఫంక్షన్ హాల్ లో ఆదివారం ఎఐసిసి పరిశీలకుడు, తమిళనాడు ఎంపీ రాబర్ట్ బ్రూస్ ఒక్కొక్కరితో వ్యక్తిగతంగా సమావేశమయ్యారు.
సమావేశానికి ఆమనగల్లు , కడ్తాల, తలకొండపల్లి మండలాల నుంచి డిసిసి అధ్యక్ష పదవికి దరఖాస్తు చేసుకున్న టిపిసిసి సభ్యుడు ఆయిళ్ల శ్రీనివాస్ గౌడ్, డిసిసి అధికార ప్రతినిధి గూడూరు శ్రీనివాస్ రెడ్డి, డిసిసి ఉపాధ్యక్షుడు భగవాన్ రెడ్డి, డిసిసి ప్రధాన కార్యదర్శి మిట్టపల్లి అంజయ్య, గిరిజన సేవా సంఘం రాష్ర్ట అధ్యక్షుడు హనుమా నాయక్ లు హాజరయ్యారు.
డిసిసి అధ్యక్ష పదవి విషయంలో పరిశీలకుడు ఒక్కొక్కరి అభిప్రాయ సేకరణ చేసినప్పుడు తమకు అవకాశం కల్పించకపోతే బీసీ సామాజిక వర్గానికి చెందిన ఆయిళ్ల శ్రీనివాస్ గౌడ్ కు అవకాశం కల్పించాలని సూచించారు.
అనంతరం రాబర్ట్ బ్రూస్ కు అందరం కలిసి తమ అభిప్రాయాన్ని తెలిపినట్లు దరఖాస్తు చేసుకున్న వారు స్పష్టం చేశారు. కాగా ఆమనగలు బ్లాక్ పరిధిలోని మండల కాంగ్రెస్ అధ్యక్షులు కూడా ఏ ఐ సిసి పరిశీల కుడికి ఏకాభిప్రాయం తెలిపినట్లు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యాట నర్సింహ్మా తెలిపారు.