calender_icon.png 6 August, 2025 | 4:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సనత్‌నగర్‌లో ఖబరస్థాన్ సమస్య పరిష్కరిస్తా

04-08-2025 12:00:00 AM

ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్

సనత్‌నగర్, ఆగస్టు ౩ (విజయక్రాంత్): సనత్నగర్ ప్రాంత ముస్లీం వర్గానికి సంబంధించిన ఖబరస్థాన్ సమస్యను పరిష్కరించేం దుకు తాను పూర్తిస్థాయిలో కృషి చేస్తానని మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హామీ ఇచ్చారు.ఆదివారం వెస్ట్ మారేడ్‌పల్లిలోని తన కార్యాల యంలో పలు మసీదు కమిటీల ప్రతినిధులు, మత పెద్దల బృందం తలసానిని కలి సింది.

ఖబరస్థాన్ లేకపోవడం వల్ల అంత్యక్రియలకు తీవ్ర సమస్యలు ఎదురవుతున్నా యని, చాలా దూరంలోని ఖబరస్థాన్లకు మృతదేహాలను తరలించాల్సిన దుస్థితి ఉందని వారు వివరించారు. స్థానికంగా ఖబరస్థాన్ స్థలాభావం కారణంగా, బేగంపేట్లోని ఓల్ కష్టమ్ బస్తీ ఖబరస్థాన్ను వినియోగించుకునేందుకు అక్కడి కమిటీని ఒప్పించేందు కు సహకరించాలని ఎమ్మెల్యేను విజ్ఞప్తి చేశారు.

ఈ నేపథ్యంలో స్పందించిన తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, సనత్నగర్లో ఖబరస్థాన్ ఏర్పాటు కోసం గతంలోనే ప్రయత్నాలు చేసినప్పటికీ, అవసరమైన స్థలం అందుబాటులో లేకపోవడం వల్ల ముందుకు సాగలేకపోయామని చెప్పా రు. ఓల్ కష్టమ్ వాసులు కూడా గతంలో ఖబరస్థాన్ కోసం అనేక ఇబ్బందులు ఎదుర్కొ న్నారనీ, 60 ఏళ్లుగా ప్రతి ఎన్నికలో ఇదే హామీ ఇవ్వబడినా సమస్య పరిష్కారం కాలేదని గుర్తు చేశారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత, సీఎం కేసీఆర్ మరియు మంత్రి కె.టి.ఆర్ సహకారంతో స్థలం కేటాయించడంతో పాటు అభివృద్ధి పనుల కోసం రూ.3 కోట్లు మంజూరైన విషయాన్ని వివరించారు. త్వరలోనే ఓల్ కష్టమ్ ఖబరస్థాన్ కమిటీ ప్రతినిధులతో ప్రత్యేక సమా వేశం ఏర్పాటు చేసి, సానుకూల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను కలిసిన వారి లో మసీదు కమిటీ అధ్యక్షులు మహ్మద్, నోమాన్, మాజిద్, యాకూబ్, రహీం, జమీర్, షంషేర్ తదితరులు పాల్గొన్నారు.