calender_icon.png 20 September, 2025 | 9:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చదువుతో పాటు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం ఎంతో ఉపయోగం

20-09-2025 06:59:05 PM

భద్రాచలం (విజయక్రాంతి): బాలికలకు చదువుతో పాటు తనకు తాను రక్షించుకోనీ తన తోటి వారికి ఎటువంటి ఆపదలు వచ్చినా ధైర్యంతో మొక్కవోని దీక్షతో ఎదురించి సమాజంలో సుఖంగా జీవించడానికి మార్షల్ ఆర్ట్స్, సెల్ఫ్ డిఫెన్స్ శిక్షణలు నేర్చుకోవడం బాలికలకు భవిష్యత్తులో, కష్టకాలంలో ఎంతో ఉపయోగపడతాయని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్(ITDA Project Officer B. Rahul) అన్నారు. శనివారం భద్రాచలం పట్టణంలోని డిగ్రీ కళాశాలలో మహిళా సాధికారత ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న పిఓను కళాశాల ప్రిన్సిపాల్  సిబ్బంది ఘనంగా స్వాగతం అనంతరం బాలికల ఆత్మరక్షణ శిక్షణ కార్యక్రమంలో శిక్షణ తీసుకున్న బాల బాలికలకు ప్రశంసా పత్రాలు ప్రధానం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాల బాలికల ఆత్మ రక్షణకు మహిళా సాధికారత ఆధ్వర్యంలో కరాటే, మార్షల్ ఆర్ట్స్ సెల్ఫ్ డిఫెన్స్ వంటి శిక్షణలు అందించి సమాజంలో వారు కష్టకాలంలో ధైర్యంగా ముందడుగు వేయడానికి ఇటువంటి శిక్షణలు ఎంతో దోహదం చేస్తాయని అన్నారు. 15 రోజులపాటు శిక్షణ తీసుకున్న బాల బాలికలు ప్రతిరోజు వాటికి సంబంధించిన మెళుకువలు సాధన చేస్తూ ఉండాలని, కష్ట సమయంలో మాత్రమే మీరు నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్ విద్యకు పని కల్పించాలన్నారు. నేటి సమాజంలో బాలబాలికలు సుఖంగా జీవించాలంటే ఆత్మరక్షణకు ఇటువంటి విద్యలు నేర్చుకోవడం అత్యవసరమని, ఇది వారికి ధైర్యం ఆత్మవిశ్వాసం మనసులో నిండుకొని ముందడుగు వేయడానికి శక్తిని ఇస్తుందని అన్నారు.

ఇటువంటి విద్యలు విపత్కర పరిస్థితిలో మాత్రమే ఇటువంటి విద్యలకు పని చెప్పాలని, ఎప్పడు పడితే అప్పుడు ఎవరు మీద పడితే వారి మీద ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించకూడదని బాలికలకు సూచించారు. అనంతరం డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ జాన్ మిల్టన్ మాట్లాడుతూ డిగ్రీ కళాశాలలో చదువుతున్న బాలికల కోసం ఆత్మ రక్షణ శిక్షణ మహిళా సాధికారత విభాగం ఆధ్వర్యంలో ఆగస్టు 29 నుండి సెప్టెంబర్ 16 వరకు 15 రోజులపాటు కరాటే, మార్షల్ ఆర్ట్స్లో సెల్ఫ్ డిఫెన్స్ ఎక్స్పైర్ షేక్ హర్షద్ ఆధ్వర్యంలో శిక్షణ అందించడం జరిగిందని, బాలికలు ఎంతో శ్రద్ధతో శిక్షణలో పాల్గొని తమరక్షణకు కావలసిన నైపుణ్యాలు నేర్చుకొని మహిళల భద్రతపై అవగాహన పెంచుకున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో రఘు సుమా ప్రోగ్రాం ఆఫీసర్, వైస్ ప్రిన్సిపాల్ హవేల, అకడమీక్ కోఆర్డినేటర్ హిమజ, మహిళా సిబ్బంది కపిల భారతి, సమీరా, శ్రీలత, పర్యవేక్షకురాలు రేవతి, పూర్ణిమ, కల్పన, శరణ్య, పావని, భవాని, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.