calender_icon.png 20 September, 2025 | 9:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్ఆర్ఎం స్కూల్ నందు దసరా పండుగ బొమ్మల కొలువు

20-09-2025 06:56:25 PM

ఛైర్మెన్ కేశనేని శ్రీదేవి..

కోదాడ: కోదాడ పట్టణం బాలాజీనగర్ లో ఉన్న ఎస్ఆర్ఎం స్కూలు నందు దసరా బొమ్మల కొలువును స్కూల్ ఛైర్మెన్ కేశనేని శ్రీదేవి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... హిందూ సంప్రదాయాలను, ఆచారాలను ప్రతిబింబించేలాగ, పల్లెటూరి వాతావరణం ఉట్టిపడేలాగా, నాటి తరానికి నేటి తరానికి గల వ్యత్యాసాలను చూపిస్తూ నెలకొండ వారిచే చెక్కతో తయారుచేసిన  బొమ్మల కొలువును ప్రదర్శించామని వారన్నారు. అలాగే విద్యార్థులు చేత బతుకమ్మలను తయారు చేపించి ఆటపాటలతో దసరా ఉత్సవాలను ప్రారంభించామని అలాగే ప్రకృతి నుంచి వచ్చే బతుకమ్మ పువ్వులు ఆకులలో ఉండే ఔషధ గుణాలను సైతం విద్యార్థులకు వివరించామని ఈ సందర్భంగా తెలిపారు. 1600 మంది విద్యార్థులతో అత్యున్నతమైన విద్యతోపాటు విద్యార్థులలో మానసిక ఉల్లాసాన్ని కలిగే విధంగా ఎస్ఆర్ఎం స్కూల్ ముందుకు వెళుతుందని తెలిపారు.