calender_icon.png 17 May, 2025 | 11:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వాహనాల ద్వారా శబ్ద కాలుష్యం కలిగిస్తే చట్టపరమైన చర్యలు

17-05-2025 08:12:36 PM

డీఎస్పీ శ్రీధర్ రెడ్డి..

కోదాడ: వాహనాల ద్వారా శబ్ద కాలుష్యం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కోదాడ డీఎస్పీ శ్రీధర్ రెడ్డి(DSP Sridhar Reddy) అన్నారు. శనివారం యువకుల బుల్లెట్ వాహనాల ద్వారా 16  సైలెన్సర్లను కోదాడలో పెద్ద కాలుష్యం చేస్తున్న బుల్లెట్ ద్విచక్ర వాహనాలను పట్టుకున్నారు. అనంతరం ఆ వాహనాల సైలెన్సర్లను పట్టణంలోని పోలీస్ స్టేషన్ ఎదురుగా తొలగించి రోడ్డు రోలర్ తో ధ్వంసం చేసి మాట్లాడారు. నిభందనలు అతిక్రమించి వాహనాలు నడిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు. యువకుల్లో పరివర్తన తెచ్చేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు డీఎస్పీ తెలిపారు. కాగా సైలెన్సర్లను ధ్వంసం చేస్తున్న సంఘటనను స్థానికులు ఉత్కంఠతో చూశారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ శివశంకర్ నాయక్, పట్టణ ఎస్ఐ రంజిత్ రెడ్డి, ట్రాఫిక్ ఎస్ఐ మల్లేష్ సిబ్బంది తదితరులు ఉన్నారు.