17-05-2025 11:18:50 PM
కొత్తగూడెం (విజయక్రాంతి): బంగారు నగలలో స్వచ్ఛత ఉందా లేదా అని తెలుసుకునేందుకు ఏర్పాటు చేసిన తనిఖీ కేంద్రాన్ని సీనియర్ న్యాయవాది, ప్రభుత్వ రంగ సంస్థల సింగరేణి స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్ జీవీకే మనోహర్ ప్రారంభించారు. శనివారం జిల్లా కేంద్రమైన కొత్తగూడెం పట్టణంలోని పెద్దబజార్ లో చిట్టిమళ్ళ బ్రహ్మచారి, యశోద శ్రీనివాస ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. బంగారపు వస్తువులు తయారు చేయించుకున్న, రెడీమేడి వస్తువులను కొనుగోలు చేసిన, ఆ నగలలో స్వచ్ఛత ఉందా లేదా అని తెలుసుకునేందుకు వీలుగా ఒక ప్రైవేట్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఆ బంగారపు వస్తువులలో హాల్ మార్క్ ఉందా లేదా అనగా 91.6 శాతం బంగారం కొనుగోలు చేసామా! లేదా అని ఈ తనిఖీ కేంద్రంలో తెలుసుకునే అవకాశ ఉంటుందన్నారు. ప్రజలు కొనుగోలు చేసే బంగారంలో వ్యాపారస్తులు చెప్పిన విధంగా నాణ్యత ఉందా లేదా అనేది కూడా తెలుసుకోవచ్చు అన్నారు.