17-05-2025 11:29:16 PM
గవర్నర్ జిష్ణు దేవ్ వర్మకు వినతి
ముషీరాబాద్ (విజయక్రాంతి): భోలక్ పూర్ లో 400ల సంవత్సరాల చరిత్ర కలిగిన చారిత్రాత్మక కట్టడం బడీ మసీదును పరిరక్షించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ కన్వీనర్ సయ్యద్ మోహినొద్దీన్ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ(State Governor Jishnu Dev Verma)ను కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శనివారం రాజ్ భవన్ లో గవర్నర్ ను కలిసి వినతిపత్రం అందజేసి మాట్లాడారు. నగరంలో చార్మినార్ నిర్మించిన సమయంలో భోలక్ ప్పూర్ బడీ మసీదు (జామియా మసీదు) ను నిర్మించారని తెలిపారు. మసీదు మినార్లు పెచ్చులూడి అందకారంగా మారుతున్నదని ఫిర్యాదు చేశారు. మసీదు మరమత్తులకు నిధులు విడుదల చేయించాలని విజ్ఞప్తి చేశారు. మసీదును సందర్శించాలని ఆయన గవర్నర్ ను కోరినట్లు తెలిపారు.