17-05-2025 11:12:31 PM
భక్తజన జాతరగా కాళేశ్వరం త్రివేణి సంగమం..
ఒక్కరోజే కాళేశ్వరం లో రూ. 3 లక్షల మంది దర్శనం..
మంథని (విజయక్రాంతి): భక్త జన జాతరతో కాళేశ్వరం కళకళలాడుతోంది. సరస్వతి నది పుష్కరాల్లో భాగంగా మూడో రోజూ భక్తులు పోటెత్తారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం(Kaleshwaram)లో పుష్కరాలకు శుక్రవారం సుమారు రూ. 3 లక్షలకు పై చిలుకు భక్తులు తరలివచ్చారు. త్రివేణి సంగమం(Triveni Sangam) ప్రాంతాన గల సరస్వతి నదిలో పుష్కర స్నానాలు ఆచరించి సైకత లింగాలను పూజించి అనంతరం కాళేశ్వరంలోని ముక్తీశ్వర స్వామిని దర్శనం చేసుకుంటున్నారు. ఆలయంలో భక్తులకు సుమారు 3 నుండి 4 గంటల వరకు క్యూ లైన్ లో భక్తులు లైన్ లో ఉండి స్వామి వారిని దర్శనం చేసుకుంటున్నారు.
భక్తులకు తప్పని తిప్పలు
సరస్వతి నాది పుష్కరాలకు వచ్చిన భక్తులు సరస్వతి నది తీరంలో తిప్పలు తప్పడం లేదు.. ఎండకు భక్తులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. నది నుండి మెట్ల వరకు నడుచుకుంటూ రావడంతో ఇబ్బందులు పడుతున్నారు. గోదారి వద్ద చలివేంద్రాలు పెంచాలని కోరుతున్నారు.
ఒక్క వానకు రోడ్లన్నీ బుడదమయం
కాళేశ్వరంలో పుష్కరాల సందర్భంగా చేసిన రోడ్లన్నీ బురదమయం అయ్యాయి. కాలేశ్వరం గ్రామం నుండి విఐపి పుష్కర ఘాట్ వరకు రోడ్లు మొత్తం బుర్రమయం అవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు .గ్రామం లో ఎక్కడ చుసిన బురదమయం అయ్యింది. అలాగే రాత్రి కురిసిన వర్షం కు పుష్కర ఘాట్ వద్ద ఉన్నా టెంట్లు అన్ని కుప్ప కూలిపోయాయి. నదిలో వేసిన చలువ పందిర్లు అన్ని కులడంతో సిబ్బంది అన్ని మళ్ళీ వేశారు.