17-05-2025 08:09:14 PM
ఎంపీ వంశీకృష్ణకు అవమానంపై నిరసన..
మంత్రిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నమోదు చేయాలంటూ డిమాండ్..
బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు గడ్డం వంశీ కృష్ణ(MP Gaddam Vamsi Krishna)ని అవమానించిన మంత్రి శ్రీధర్ బాబుపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి దళిత సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో శనివారం బెల్లంపల్లి అంబేడ్కర్ విగ్రహం ముందు ఆందోళనకు దిగాయి. దళిత సంఘాల అధ్యక్షులు కుంభాల రాజేష్, చిలుక రాజనర్సు, మాట్లాడుతూ.. భారత రాజ్యాంగాన్ని అమలు పరచాలంటూ జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే రాహుల్ గాంధీ సోనియా గాంధీ ఒకవైపు భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటూ అన్ని రాష్ట్రాల వ్యాప్తంగా ప్రచారం చేస్తుండగా మన తెలంగాణ రాష్ట్రంలో దౌర్భాగ్యం ఇంకా మనువాద మత్తులో మంత్రి వర్గం కొనసాగుతున్నదని మండిపడ్డారు.
75 సంవత్సరాల స్వాతంత్ర దేశంలో మనువాదాన్ని కొనసాగిస్తున్న మంత్రి శ్రీధర్ బాబు మంత్రి పదవిలో కొనసాగే అర్హతను కోల్పోయారన్నారు. ప్రజల చేత ఎన్నుకోబడిన పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు గడ్డం వంశీకృష్ణ ని ప్రోటోకాల్ ను పాటించకుండా అవమానించారని విమర్శించారు. ఈ ఘటన యావత్ దళిత జాతిని అవమాన పరచడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రోటోకాల్ ను పాటించకుండా అవమానపరిచిన శ్రీధర్ బాబును మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో దళిత సంఘాల ఐక్యవేదిక వర్కింగ్ ప్రెసిడెంట్ దుర్గం గోపాల్, ప్రధాన కార్యదర్శి రత్నం ఐలయ్య, అధికార ప్రతినిధి ఆకునూరి రాజ కుమార్, ఉపాధ్యక్షులు కుష్ణపల్లి రాజలింగు, బందేలమురళి, కాంపెల్లి రాజం, కార్యదర్శులు గద్దల కుమార్, గోగర్ల శేఖర్, గజ్జల రాంనాథ్, కాంపెల్లి సతీష్, సామర్ల కృష్ణ, కల్లెపల్లి నవీన్, గంగారపు రమేష్, ఎనగందుల శివాజీ, గౌరవ సలహాదారులు దాసరి బానయ్య, మాస మురళి, ఉండ్రాల్ల మల్లయ్య, బత్తుల రాజలింగు, కుష్ణ పల్లి నారాయణ, కారెంగుల మల్లేష్, తదితరులు పాల్గొన్నారు.