17-05-2025 11:25:04 PM
మందమర్రి (విజయక్రాంతి): మండలంలోని మామిడి గట్టు గ్రామానికి చెందిన డిగ్రీ విద్యార్థిని దుర్గం సాత్విక (19) ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాలలోని ఒక ప్రైవేటు కాలేజీలో డిగ్రీ రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని శనివారం సెమిస్టర్ పరీక్షలకు హాజరై ఇంటికి చేరుకుని ఇంట్లో ఎవరు లేకపోవడంతో ఇంట్లోని దూలానికి చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతికి కారణాలు తెలియరాలేదు. ఈ మేరకు రామకృష్ణాపూర్ ఎస్సై రాజశేఖర్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.