calender_icon.png 18 May, 2025 | 3:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయ ఆకస్మిక తనిఖీ..

17-05-2025 11:04:52 PM

సూర్యాపేట (విజయక్రాంతి): జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంను శనివారం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారుల బృందం ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ రాథోడ్ పర్సనల్ డైరెక్టర్, డాక్టర్ సుమిత్రా రాణి డిప్యూటీ సిఎస్ పిసిపి ఎన్డిటి, శ్వేతా మోహన్ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ హైదరాబాద్ లు పూర్తిస్థాయి పరిశీలన చేసి జిల్లాలో ఆసుపత్రుల అనుమతులకు సంబంధించిన వివరాల గురించి డిఎంహెచ్వో కోటా చలంను అడిగి తెలుసుకున్నారు.

గత వారం రోజులుగా సూర్యాపేటలో పలు ఆసుపత్రులపై వస్తున్న ఆరోపణల దృష్ట్యా ఆసుపత్రుల అనుమతులకు సంబంధించిన అర్హత పత్రాలను, వైద్యాధికారుల పర్మిషన్ సర్టిఫికెట్స్ పరిశీలించారు. తదుపరి నాలుగు ఆసుపత్రులకు సంబంధించిన అన్ని వివరాలను సర్టిఫికెట్స్ ను రాష్ట్ర ఆరోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ రవిచంద్రనాయక్ కు సమర్పించి, అనంతరం ప్రిన్సిపల్ సెక్రెటరీకి తదుపరి చర్యల నిమిత్తమై పంపడం జరుగుతుందని రాష్ట్ర బృందం అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ రాథోడ్ తెలిపారు.