ములుగు: ములుగు మండల పరిధిలోని మదనపల్లి ప్రాంతంలో చిరుతపులి సంచరిస్తోందని ములుగు అటవీశాఖ రేంజ్ అధికారి శంకర్ తెలిపారు. మదనపల్లి పట్టి చేనులో చిరుత పాదముద్రలను అటవీశాఖ అధికారులు గుర్తించారు. పాకాల అడవుల నుంచి ములుగు మదనపల్లి మార్గం గుండా ప్రేమనగర్‌కు చేరుకున్న ఈ చిరుత ప్రస్తుతం జాకారం పరిసర ప్రాంతాల్లో ఉన్న విషయం తెలిసిందే. రైతులు, పశువుల కాపరులు, చుట్టుపక్కల పంట పొలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎవరైనా చిరుత సంచారాన్ని చూసినట్లయితే 9849358923 నంబర్‌కు సమాచారం అందించాలని కోరారు.