01-05-2025 08:38:27 PM
తాడ్వాయి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కృష్ణాజివాడి, తాడ్వాయి, ఎర్రపహాడ్, దేమి కళాన్, బ్రాహ్మణపల్లి గ్రామాల్లో గురువారం మేడే ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మిక జెండాలను ఆవిష్కరించి ఉత్సవాలు జరుపుకున్నారు. కార్మికులు మాట్లాడుతూ... ప్రభుత్వం కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘం నాయకులు, గ్రామ పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు.