01-05-2025 08:24:05 PM
బైంసా (విజయక్రాంతి): బాసర గోదావరి నదిలో దూకి ఆత్మహత్య ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ఓ వ్యక్తిని గురువారం బాసర పోలీసులు రక్షించారు. బైంసా మండలం అంపులి గ్రామానికి చెందిన ఓ యువకుడు తండ్రి మందలించడంతో బాసర వద్దకు వెళ్లి గోదావరి నదిపై ఉన్న బ్రిడ్జి నుండి దూకేందుకు ప్రయత్నించగా సమాచారం అందుకున్న పోలీసులు దినేష్ మోహన్ సింగ్ అక్కడికి వెళ్లి ఆయనను పట్టుకొని కౌన్సిలింగ్ చేసి పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పగించారు.