01-05-2025 08:32:01 PM
ఎల్లారెడ్డి (విజయక్రాంతి): తమ రెక్కల కష్టాన్ని నమ్ముకొని జీవిస్తున్న శ్రమ జీవుల కార్మిక దినోత్సవం మే డే సందర్భంగా ఎల్లారెడ్డి మండల కేంద్రంలో మౌలాన్ ఖేడ్ భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా మే డే జరిపించడం జరిగింది. విలేజి అధ్యక్షుడు కుసల కంటి సాయిలు కొబ్బరికాయ కొట్టి భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం జెండా ఎగిరవేశారు. ఉపాధ్యక్షుడు బాబు ప్రధాన కార్యదర్శి బాలరాజ్ కోశాధికారి పిట్ల రాములు నాయకులు మాట్లాడుతూ... ప్రతి సంవత్సరం మే 1వ తేదీన జరుపుకునే కార్మిక దినోత్సవ, ప్రజాల కార్మికుల శెలవుదినంగా, చాలా దేశాలలో మే ఒక్కటి రోజు, అంతర్జాతీయ కార్మిక దినోత్సవం లేదా కార్మిక దినోత్సవంతో ఏకీభవిస్తాయి. ఇవి అన్నీ కూడా కార్మికుల పోరాటం, కార్మికుల ఐక్యతను గుర్తిస్తాయి అని అన్నారు. కార్మికులు అందరూ ఐక్యమత్యంగా ఉండి తమ హక్కులను సాధించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రచార కార్యదర్శి పిట్ల రాజు సలహాదారుల హనుమంతు, ప్రవీణ్ రమేష్ మైపాల్ చంద్రశేఖర రావు సతీష్ కుమార్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.