calender_icon.png 2 May, 2025 | 1:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నెత్తురోడుతున్న రహదారి...

01-05-2025 08:25:19 PM

మండల కేంద్రంలో వరుసగా రోడ్డు ప్రమాదాలు...

కలవర పెడుతున్న రోడ్డు ప్రమాదాలు..

రహదారిపైకి రావాలంటే ప్రాణాలు అరిచేతులు పెట్టుకోవాల్సిందే..

వేములపల్లి (విజయక్రాంతి): అతివేగం... నిర్లక్ష్యం... నిద్రమత్తు... మద్యం మత్తు... నిబంధనలు పాటించకపోవడం రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణాలు అవుతున్నాయి. తరచూ రోడ్డు ప్రమాదాలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వరుసగా రోడ్డు ప్రమాదాలు జరుగుతుండడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. నల్గొండ జిల్లా వేములపల్లి మండల కేంద్రంలో నార్కట్పల్లి అద్దంకి రహదారి నెత్తురోడుతున్నాయి. గడిచిన కొన్ని నెలల వ్యవధిలోనే నలుగురు మృత్యువాతపడ్డారు. మరో కొంతమందికి గాయాలయ్యాయి.

వేములపల్లి మండల కేంద్రం మీదుగా రహదారి ఈ రహదారిని నార్కెట్పల్లి నుంచి అద్దంకి వరకు గత కొన్ని సంవత్సరాల క్రితం నిర్మించారు.  అప్పటినుండి ఏదో ఒక సమయంలో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.తాజాగా మంగళవారం వేములపల్లి మండల కేంద్రంలో నార్కెట్పల్లి అద్దంకి రహదారిపై బైకుపై వెళుతున్న వ్యక్తిని, ప్రభుత్వ పాఠశాల పక్క సందులో నుంచి వచ్చిన స్కార్పియో వాహనం బైకును ఢీ కొట్టింది. ఈ ఘటనలో మిర్యాలగూడ పట్టణానికి చెందిన వ్యక్తి మృతి చెందారు. మండలంలో ఇటీవల చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదాలతో రహదారి ఎక్కాలంటే వాహనాదారులు జంకె పరిస్థితి నెలకొంది.

నిర్లక్ష్యం వల్లనే ప్రమాదాలు

వాహనాదారుల నిర్లక్ష్యం వల్లనే అమాయకమైన ప్రజల ప్రాణాలు పోతున్నాయి. ఇంటికి త్వరగా చేరుకోవాలని అతివేగంతో ప్రయాణించడం వలన ఏమో కానీ రోడ్డు ప్రమాదంలో తరచు ప్రాణాలు కోల్పోతున్నారు. వాహనాలు నడపడం ఎంత ముఖ్యమో అంతకంటే ప్రాణాలు ముఖ్యం అనే అంశాలను డ్రైవర్లు పెడచెవిన పెడుతున్నారు. అతివేగంతో వాహనాలు నడపడం, అవగాహన లేకుండా ఓవర్టేక్ చేయడంతో వారితోపాటు ఇతర వాహనాదారులను ప్రమాదల బారిన పడేస్తున్నారు. రాత్రి వేళల్లో నిద్రలేమి మద్యం సేవించి వాహనాలు నడపడంతో ప్రమాదాలు జరిగి విగతా జీవులుగా మారుతున్నారు. 

ఈ మధ్యకాలంలో జరిగిన రోడ్డు ప్రమాదాలు

*16.02.2025 వేములపల్లి మండల కేంద్రానికి చెందిన పుట్టల రాములు రోడ్డు దాటుతుండగా కారు ఢీకొని మృతి చెందారు.

*04.30.2025 వేములపల్లి మండల కేంద్రానికి చెందిన పుట్టల కృష్ణయ్య రోడ్డు దాటుతుండగా మిర్యాలగూడ నుంచి నల్గొండ వైపుకు వెళ్తున్న గుర్తుతెలియని వాహనం ఢీకొని మృతి చెందారు.

అదే గ్రామానికి చెందిన పుట్టల జానయ్య తన వృద్ధాప్య పెన్షన్ డబ్బులు తీసుకొని రోడ్డు దాటుతుండగా అతి వేగంగా వచ్చిన వాహనం ఢీకొని మృతి చెందారు. వేములపల్లి గ్రామానికి చెందిన చల్లబొట్ల లక్ష్మారెడ్డి తన వ్యవసాయ పొలం పనులు ముగించుకొని తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో వాహనం తీర్పుని గుర్తించారు. ఇలా ఎందరో ఈ రహదారిపై ప్రాణాలను కోల్పోతున్నారు. ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. రహదారి ఏర్పడినప్పటి నుండి ఇలాంటి ప్రమాదాలు జరుగుతుండడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రజాప్రతినిధులు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు వాహనా దారులు కోరుతున్నారు.