01-05-2025 08:39:59 PM
తాడ్వాయి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం సంతయిపేట గ్రామంలో గురువారం ఎంపీడీవో సాజిద్ అలీ ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు వేగంగా పనులు నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ సవిత రెడ్డి, హౌసింగ్ ఏఈ అశోక్ తదితరులు పాల్గొన్నారు.