3 July, 2026 | 10:18 AM

ఓటును సద్వినియోగం చేసుకుందాం!

09-05-2024 12:05 AM

ఎన్నికల రోజు అయిన 13వ తేదీని రాష్ట్ర ప్రభుత్వం వేతనంతో కూడిన సెలవు దినంగా ప్రకటించింది. ప్రభుత్వరంగంలోని వారికేకాక ప్రైవేటు రంగంలోని ఉద్యోగులకూ ఇది వర్తిస్తుందని ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ప్రకటించారు. సెలవు దొరికింది కదా అని ఊరికే ఎంజాయ్ చేయడం మంచిది కాదు. దీనిని ఓటర్లు అందరూ సద్వినియోగపరచుకోవాలి. మన ఓటు ఎవరికి వేస్తామో మన ఇష్టం. కాకపోతే, వేయడం మాత్రం తప్పనిసరి అని అందరం గుర్తిద్దాం.

కరుణాకర్, తూప్రాన్