3 July, 2026 | 9:14 AM

ప్రాణాలు తీసిన వర్షం

09-05-2024 12:05 AM

మంగళవారం తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు ప్రజలు అతలాకుతలమయ్యారు. ‘ఇదేం వానరా బాబు’ అని తలలు పట్టుకొనే పరిస్థితి. ఒక డ్రైవర్, ఇద్దరు కూలీలు ప్రాణాలు కోల్పోయినట్లు వార్తలు వచ్చాయి. బహదూర్‌పురాలో ఒక వ్యక్తి విద్యుత్ స్తంభాన్ని తాకడం ద్వారా ప్రాణాలు పోగొట్టుకోవడం అత్యంత దురదృష్టకరం. మియాపూర్‌లో 13.3 సెం.మీ. వర్షపాతం నమోదైంది కనుకే, ఆ పరిసర ప్రాంతాల నగరవాసులు రోడ్లమీద నరకయాతన పడ్డారు. వడగల్లు, పిడుగులు, ఉరుములు, మెరుపులతో వాతావరణం భయానకంగా మారింది.

 శివకుమార్, ఉప్పల్