calender_icon.png 12 January, 2026 | 5:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐకమత్యంతో మున్నూరుకాపుల సత్తా చాటుదాం

12-01-2026 12:59:57 AM

నిజామాబాద్ మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ 

నిజామాబాద్ జనవరి 11 (విజయక్రాంతి): ఐకమత్యంతో ఉండి మున్నూరు కాపులా సత్తా చాటుదామని మాజీ మేయర్, మాజీ పిసిసి ఉమ్మడి రాష్ట్ర అధ్యక్షుడు డి శ్రీనివాస్ తనయుడు మున్నూరు కాపు జిల్లా సంఘం అధ్యక్షుడు ధర్మపురి సంజయ్ అన్నారు. స్వర్గీయ డిఎస్ ఆశయాలకు అనుగుణంగా సంఘాన్ని మరింత బలోపేతం చేస్తానని సంజయ్ స్పష్టం చేశారు. ఆదివారం మున్నూరు కాపు జిల్లా సంఘం ఆధ్వర్యంలో ఇటీవల గెలుపొందిన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల సన్మాన కార్యక్రమం సంజయ్ అధ్యక్షతన నగరంలోని ప్రగతి నగర్ మున్నూరు కాపు సంఘంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా శివాజీ నగర్ నుంచి ప్రగతి నగర్ మున్నూరు కాపు సంఘం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు.

సందర్భంగా గెలిచిన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల ఉద్దేశించి ధర్మపురి సంజయ్ మాట్లాడారు. మున్నూరు కాపులు రాజకీయంగా ఎదగాలని, ఏ కష్టం వచ్చినా జిల్లా కేంద్రంలో నేనున్నానని మర్చిపోవద్దన్నారు. రాజకీయంగా ఎదుగుదలకు నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. జిల్లాలో 450 పైచిలుకు సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు మెంబర్లుగా గెలవడం గొప్ప విషయమని, ఇంతమందిని ఒకే వేదికపై సన్మానించడం సంతోషంగా ఉందన్నారు. రాబోవు రోజుల్లో మున్నూరు కాపులతో బ్రహ్మాండంగా సభ నిర్వహించనున్నామని ధర్మపురి సంజయ్ అన్నారు. సన్మాన కార్యక్రమం కోసం ఎంతోమంది శ్రమ దాగిందని, వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు.

మీ అందరిని ఇలా చూస్తుంటే ఆనాడు ధర్మపురి శ్రీనివాస్ గుర్తొస్తున్నారన్నారు. ఆయన సంఘానికి ఎంతో సేవ చేశారని, ఆయన అడుగుజాడల్లో నడుస్తూ సంఘం అభివృద్ధి కోసం కృషి చేస్తానని అన్నారు. ఐకమత్యంగా ఉంటేనే ఏదైనా సాధించగలమని, గ్రామ మండల స్థాయిలలో మున్నూరు కాపులు ఏకం కావలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ సన్మాన మహోత్సవ కార్యక్రమం లో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందన్, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, మాజీ మేయర్ ఆకుల సుజాత, ధర్మపురి సురేందర్, బంటు బాలవర్తి, రామ్మర్తి గంగాధర్, కౌడప్ శరత్, బుస్స ఆంజనేయులు, వరాల రాజు, పబ్బు భూమేష్ పలువురు సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డుమెంబర్లు, మున్నూరు కాపు సంఘం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.