06-07-2025 07:55:39 PM
నిర్మల్ (విజయక్రాంతి): సంఘం ఐక్యతతో అభివృద్ధిని సాధించుకుందామని ఎన్టీఆర్ మార్గం అధ్యక్షులు భూసారపు గంగాధర్ అన్నారు. ఆదివారం ఎన్టీఆర్ మార్గ అభివృద్ధి కమిటీ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించి కాలనీలో ఉన్న సమస్యలు వాటి పరిష్కారానికి కార్యాచరణపై చర్చించడం జరిగిందని తెలిపారు. కాలనీ సమస్యలపై అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో జిల్లా అధికారులకు ప్రజాప్రతినిధులకు విన్నవించి నిధులు మంజూరు చేసుకునేలా కృషి చేద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు నాయకులు పాల్గొన్నారు.