06-07-2025 10:49:51 PM
తెలంగాణ అభివృద్ధి కేసిఆర్ వల్లే సాధ్యం అయ్యింది..
మళ్లీ కేసీఆరే కావాలంటున్న ప్రజలు..
ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు..
ఏటూరునాగారం (విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చని కార్యకర్తలందరూ ఐకమత్యంగా ఉండి ఎన్నికలకు సిద్ధం కావాలని కాకులమర్రి లక్ష్మణ్ బాబు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు(District President Kakulamarri Laxman Babu) ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఏ పల్లెకు వెళ్లినా ఏ వాడకు వెళ్లినా మళ్లీ కేసీఆర్ సారే ముఖ్యమంత్రి కావాలంటున్నారని అన్నారు. తమకు సమయానికి రైతు బంధు వేయాలని వేడుకుంటున్నారన్నారు. కనీసం 30 శాతం మంది రైతులకు కూడా రుణమాఫీ చేయలేదన్నారు. ఈ మోసపూరిత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏ గ్రామంలో కూడా అభివృద్ధి చేయడం లేదని మండిపడ్డారు.
అబద్ధపు హామీలతో అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడైనా రావచ్చని, బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ శ్రేణులను బలపర్చేందుకు కృషి చేయాలన్నారు. కార్యకర్తలు నిత్యం ప్రజల్లో ఉండి ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలు తెలుసుకొని వారికి అండగా నిలువాలని అలాగే పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. నాయకులంతా సమన్వయంతో పని చేసి పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం అహర్నిశలు కృషి చేయాలన్నారు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ జెండా ఎగురవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.