calender_icon.png 7 July, 2025 | 1:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి

06-07-2025 07:52:46 PM

రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు బండ శ్రీశైలం..

చండూరు (విజయక్రాంతి): జూలై 9న జరిగే దేశవ్యాప్త సమ్మె(Nationwide Strike)ను జయప్రదం చేయాలని రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు బండ శ్రీశైలం అన్నారు. ఆదివారం మునుగోడు మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడులకు వ్యతిరేకంగా జులై 9న దేశ వ్యాప్తంగా జరిగే సమ్మె జయప్రదం చేయాలని కేంద్ర ప్రభుత్వం 100 సంవత్సరాలకు పైగా కార్మికులు పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను కుందించి 4 కోడ్ లుగా తీసుకురావడం జరుగుతుందని, కార్మికుల హక్కులను కాలరాసే ఈ 4 లేబర్ కోడ్ లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు సమ్మెలోకి వస్తున్నాయని కార్మికులు సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన అన్నారు.

చండూరు మండల కేంద్రంలో జులై 7 జరిగే ప్రజా సంఘాల సదస్సు సమావేశానికి ప్రజాసంఘాల జిల్లా కమిటీ సభ్యులు, ఆఫీస్ బేరర్స్,అన్ని కార్మిక సంఘాల అధ్యక్ష కార్యదర్శులు, ముఖ్య నాయకులు సమావేశనికి తప్పనిసరిగాహాజరుకావాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం నల్లగొండ జిల్లా అధ్యక్షులు కొండా, వెంకన్న, డివైఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులుమిర్యాల భరత్, చండూరు సిఐటియు చండూరు మండల కన్వీనర్ జెర్రిపోతుల ధనంజయ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.