06-07-2025 07:57:08 PM
పాపన్నపేట: ఆషాడ మాసం రెండవ ఆదివారాన్ని పురస్కరించుకొని వన దుర్గ మాతను ఫలాంబరి దేవి రూపంలో విశేషంగా అలంకరించారు. వేకువ జామునే ఆలయ అర్చకులు ఉదయం నుంచే వివిధ రకాల పండ్లతో అమ్మవారిని అలంకరించారు. ఆదివారం తొలి ఏకాదశి పండుగ కావడంతో భక్తుల రద్దీ అధికంగా ఉన్నది. ఫలంబరి దేవీగా దర్శనమిచ్చిన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి మొక్కులు చెల్లించుకున్నారు.