calender_icon.png 7 July, 2025 | 3:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజీవ్ స్వగృహ ప్లాట్స్ టీఎన్జీవోస్ యూనియన్ సభ్యులకు కేటాయించాలి

06-07-2025 11:05:15 PM

ఖమ్మం జిల్లా టీఎన్జీవోస్ యూనియన్ కార్యవర్గ సమావేశం తీర్మానం..

ఖమ్మం (విజయక్రాంతి): ఖమ్మం జిల్లా(Khammam District) టీఎన్జీవోస్ ఫంక్షన్ హాల్ లో జిల్లా కార్యవర్గ సమావేశం ఆదివారం టీఎన్జీవోస్ యూనియన్ ఖమ్మం జిల్లా కమిటీ అధ్యక్షులు గుంటుపల్లి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగింది. టీఎన్జీవోస్ హౌస్ బిల్డింగ్ సొసైటీలో దాదాపు 3500 పైగా సభ్యులు ఉన్నారని సగం మందికే ప్లాట్స్ వచ్చాయని రాజీవ్ స్వగృహ ఫ్లాట్స్ నాలుగు బ్లాక్ లు టీఎన్జీవోస్ హౌస్ బిల్డింగ్ సొసైటీ సభ్యులకు కేటాయించాలని సమావేశం తీర్మానించింది.

మధ్య తరగతి ఉద్యోగస్తులు టీఎన్జీవోలో అధిక సంఖ్యలో ఉన్నారు కాబట్టి వారికి ప్రాధాన్యత ఇవ్వాలని వారు కోరడం జరిగింది. ప్రభుత్వం ఇదే సాచివేత ధోరణితో వ్యవహరిస్తే వాయిదా వేసిన ఉద్యమ కార్యాచరణను తిరిగి పునః ప్రారంభిస్తామని టిఎన్జీవోస్ జిల్లా అధ్యక్షులు గుంటుపల్లి శ్రీనివాసరావు అన్నారు. రాష్ట్ర కమిటీలో బాధ్యతలు స్వీకరించిన బాలకృష్ణ జైపాల్ లను జిల్లా కార్యవర్గం సత్కరించి అభినందనలు తెలియజేసింది. 

ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కొణిదెన శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు గంగవరపు బాలకృష్ణ, జెడ్.ఎస్. జైపాల్ విజయ్ కుమార్, అసోసియేట్ అధ్యక్షులు కొమరగిరి దుర్గాప్రసాద్,టీఎన్జీవోఎస్ ఖమ్మం జిల్లా ప్రచార కార్యదర్శి ఎర్రమళ్ళ శ్రీనివాసరావు, కోశాధికారి వల్లపు వెంకన్న, ఉపాధ్యక్షులు ఎర్రా రమేష్, బానోత్ శ్రీధర్ సింగ్, సగ్గుర్తి ప్రకాష్ రావు ,బదావత్ కరణ్ సింగ్, ఎస్.లలిత కుమారి, సహాయ కార్యదర్శిలు తాళ్లూరి శ్రీకాంత్, భూసా చంద్రశేఖర్, యాకూబ్ పాషా, ఏలూరి హరికృష్ణ, శీలం రాధికా రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ పెద్దినేని రాధాకృష్ణ పబ్లిసిటీ సెక్రటరీ ఎర్రమల్ల శ్రీనివాసరావు ఆఫీస్ సెక్రటరీ టి.రవీంద్రబాబు, స్పోర్ట్స్ సెక్రటరీ సాయి కృష్ణ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎండి,అస్లాం ఎన్.విజయ, డి.నాగరాజు, ఇ. రవిచంద్ర, రహీమ్ ఖాన్, వాసాల శ్రీను, బి.నాగలక్ష్మి, మహిళా విభాగం చైర్ పర్సన్ జి.మృదుల తదితరులు పాల్గొన్నారు.