calender_icon.png 7 July, 2025 | 4:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంథని డివిజన్ లో ఘనంగా మొహరం మటికీల వేడుకలు

06-07-2025 10:45:06 PM

మంథని (విజయక్రాంతి): మంథని డివిజన్(Manthani Division)లోని కమాన్ పూర్, రామగిరి, ముత్తారం మండలాల్లో ఆదివారం మొహరం వేడుకల్లో భాగంగా భక్తులు గ్రామాల్లో మట్టికిలను తీశారు. ముందుగా కొత్త చిన్న కుండలను తీసుకువచ్చి వాటిని శుభ్రంగా కడిగి దానికి పూలతో గంధంతో అలంకరించి, ఇంట్లో బెల్లం పానకం తీసి, ఆ మట్టికిలో పోసి డప్పు చప్పుల మధ్య స్థానిక మసీదులకు తీసుకువెళ్లి పీరీల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేసి వీరిలకు సమర్పించారు. తొమ్మిదో రోజు ఈ మటికిల పానకం చేయడం జరుగుతుంది. అలాగే పదవ రోజైన షహదత్ అనగా పెద్ద సరిగతి వేడుకలు సోమవారం జరగనున్నాయి. దీంతో మొహరం వేడుకలు ముగింపు జరుగుతుంది. దీంతో గ్రామాల్లో మొహరం వేడుకల సందడి ముగియనుంది.