05-05-2025 12:00:00 AM
ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి
యాదాద్రి భువనగిరి మే 4 (విజయక్రాంతి): డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ ఆశయాలను సాధించినప్పుడే వారికి మనం నిజమైన నివాళులు అర్పించిన వారమవుతామనీ అందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే కుమ్మవ అనిల్ కుమార్ రెడ్డి అన్నారు.
భువనగిరి మండలం అనంతరం గ్రామంలో ఆ మహనీయుల విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత ఆర్థికవేత్త రాజకీయవేత్తగా సామాజిక సంస్కర్తగా ఈ దేశ పౌరుల హృదయాలలో తరతరాలుగా వెలుగొందుతూనే ఉంటాడని అన్నారు.
ఆ మహనీయుల త్యాగాల ఫలితంగానే నేడు వెనుకబడ్డ వర్గాల ప్రజలందరూ రాజ్యాంగ ఫలాలను అందుకోగలుగుతున్నారని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ మహనీయుల ఆశయాలను సాధించి సమాజాభివృద్ధికి వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి ప్రతి ఒక్కరు పాటుపడాలని కోరారు.
ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు క్యామ మల్లేష్, స్థానిక నాయకులు పక్కి కొండల్ రెడ్డి, తోటకూరి వెంకటేష్ యాదవ్, రేకల శ్రీనివాస్, మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్, మాజీ ఎంపీపీ ఎర్రకలమ్మ, శ్రీరాములు, మాజీ సర్పంచ్ హరిబాబు, రాజలింగం, అశోక్ , మాజీ సర్పంచ్ చందం మల్లికార్జున్, సామల వెంకటేష్ పాల్గొన్నారు