calender_icon.png 6 May, 2025 | 12:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెల్ల దొరలకు ఎదురొడ్డి నిలిచిన ధీశాలి ఓబన్న

05-05-2025 12:00:00 AM

మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి

కోదాడ మే 4 : తెల్లదొరలకు ఎదురొడ్డి నిలిచిన తొలితరం స్వాతంత్య్ర సమరయోధుడు వడ్డెర ఓబన్న అని మంత్రి ఉత్తంకుమార్‌రెడ్డి అన్నారు. ఆదివారం కోదాడ పట్టణంలోని బస్టాండ్ ఎదురుగా వడ్డెర కులస్తులు ఏర్పాటుచేసిన వడ్డెర ఓబన్న  విగ్రహాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. కోదాడలో వడ్డెర కులస్తుల స్మశాన వాటికకు కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి కృషి చేస్తానన్నారు.

ఓబన్న  విగ్రహం ఏర్పాటుకు కృషి చేసిన నాయకులు ఒంటి పులి గోపయ్య ఒంటి పులి వెంకటేష్లను అభినందించారు. కోదాడ మాజీ సర్పంచ్ ఎర్నేని బాబు ఎమ్మెల్సీ ఏసు రత్నం ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ జెరీ పేటి జైపాల్, వడ్డెర సంఘం జాతీయ నాయకులు కృష్ణయ్య రాష్ట్ర నాయకులు ఒంటి పులి గోపయ్య ఒంటి పులి వెంకటేష్ నాయకులు ఒంటి పులి శీను బత్తుల ఉపేందర్,నాగేశ్వరరావు లింగయ్య బండ్ల దాసు, చింతల నాగేశ్వరరావు తదితరులున్నారు