calender_icon.png 7 May, 2025 | 5:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

05-05-2025 12:00:00 AM

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి),ఏప్రిల్ 4:  వారంతా 19 సంవత్సరాల క్రితం 10వ తరగతి ఒకే పాఠశాలలో విద్య నేర్చుకుని వివిధ హోదాల్లో స్థిరపడ్డారు.అయినా స్నేహాన్ని మించిన బంధం మరొకటి లేదని తలచి స్నేహితులందరూ ఒకచోట కలుసుకొని మంచి చెడులు మాట్లాడుకుని, తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను మరవద్దని తలచి ఒక వేదికగా ఏర్పడి ఉత్సాహంగా గడిపారు.

పూర్తి వివరాలు వెళితే మండల కేంద్రం అర్వపల్లిలోని విజ్ఞాన్ ఉన్నత పాఠశాలలో 2006- 07 సంవత్సరంలో 10వ తరగతి పూర్తి చేసుకున్నారు.ఆదివారం అర్బపల్లిలోని లక్ష్మీ ఫంక్షన్ హాల్ లో వారంతా కలిసి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని జరుపుకుని చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకొని భావోద్వేగానికి గురయ్యారు.అనంతరం విద్యార్థులు నేర్పిన గురువులను ఘనంగా సన్మానించుకున్నారు.

పాఠశాల యాజమాన్యం రత్నం లక్ష్మాజీ, కుంభం రామ్మూర్తి, దబ్బేటి యాదగిరి, సుగుణ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు షేక్ భాష,గద్దగూటి ముత్తయ్య,ఉపాధ్యాయులు రాంప్రసాద్, జగన్, శ్రీనివాస్, సైదయ్య, సంపత్ కుమార్, వెంకన్న, కిరణ్, దేవయ్య, శ్రీనివాసరావు, రవి, పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.