calender_icon.png 10 January, 2026 | 11:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అందరం కలుద్దాం.. ఐక్యంగా పనిచేద్దాం

10-01-2026 01:06:51 AM

ఎమ్మెల్యే మేఘారెడ్డి

వనపర్తి, జనవరి 9 (విజయక్రాంతి) : కాంగ్రెస్‌లో పాత కొత్త అనే తేడా లేకుండా అందరం కలిసిపోయి పార్టీ పటిష్టత కోసం ఐక్యంగ పనిచేయాలని వనపర్తి శాసన సభ్యులు తూడి మేఘారెడ్డి , జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాష్ట్ర స్పోరట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి లు పేర్కొన్నారు. శుక్రవారం వనపర్తి పట్టణంలోనే ఆర్‌జి గార్డెన్స్‌లో నిర్వహించిన వనపర్తి మున్సి పాలిటీ 33 వార్డుల ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. రానున్న వనపర్తి మునిసిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండానే ఎజెండాగా భావించి ప్రతిఒక్కరు పనిచేయాలని వారు సూచిం చారు.

ఫామ్ హౌసుల పాలన దూరం చేసేందుకు వనపర్తి పట్టణంలోని ప్రతి ఒక్కరూ పనిచేశారని దాంతో బీఆర్‌ఎస్ అరాచక పాలనకు చరమగీతం పాడి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకలను అందజే స్తుందని వారన్నారు. మొన్న జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించిన వ్యక్తులే ప్రతి చోట గెలిచారని అక్కడక్కడ కొందరు పిలిచినంత మాత్రాన మనం నిరాశ చెందాల్సిన అవసరం లేదని వారు సూచించారు.

వనపర్తి పట్టణంలోని 33 వార్డులకు సంబంధించి ఇప్పటివరకు దాదాపు 100 కోట్ల రూపాయలకు సంబంధించిన అభివృద్ధి పనులు చేపట్టామని వారు పేర్కొన్నారు.  వనపర్తి వ్యవసాయ మార్కెట్ యార్డ్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, pcc సభ్యులు శంకరప్రసాద్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు వాకిటి ఆదిత్య, శ్రీలత రెడ్డి, తిరుపతయ్య గౌడ్, బి కృష్ణ, పుట్టపాకుల మహేష్, ధనలక్ష్మి, పట్టణ మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.