calender_icon.png 10 January, 2026 | 12:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యం

10-01-2026 01:02:31 AM

2047 నాటికి అగ్రగామిగా రాష్ట్రం

  1. ప్రపంచ నగరాలతో హైదరాబాద్ పోటీ 
  2. జర్మన్ టెక్నాలజీతో ఐవీ ఫ్లూయిడ్స్ తయారీ
  3. ఈ--సిటీలో ‘సుజెన్ మెడికేర్’ ప్రారంభంలో సీఎం రేవంత్‌రెడ్డి
  4. ఫార్మా, లైఫ్ సైన్స్ రంగంలో నాలుగో నగరం హైదరాబాదే..
  5. ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

రంగారెడ్డి, జనవరి 9 (విజయక్రాంతి): రాబోయే రెండు దశాబ్దాలలో తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచంలోనే అత్యున్నత ఆర్థిక శక్తిగా ఎదిగేలా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాల ఈ ‘సు జెన్ మెడికేర్’ ఐవీ ఫ్లూయిడ్స్ తయారీ యూ నిట్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘తెలంగాణ రైజింగ్ 2047‘ విజన్‌లో భాగంగా రాష్ట్రాన్ని అగ్రపథాన నిలుపుతామని చెప్పారు.

2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రకటించారు. 1995 నుంచి 2025 వరకు జరిగిన నిరంతర శ్రమ వల్లే నేడు హైదరాబాద్ గ్లోబల్ సిటీగా నిలిచిందని, జర్మనీ, జపాన్, సౌత్ కొరియా వంటి దేశాలతో పోటీ పడుతోందని కొనియాడారు.

రాష్ట్రం ఒక విజన్‌తో ముందుకు : మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి ఒక విజన్ పెట్టుకుని రాష్ట్రా న్ని ముందుకు తీసుకెళుతున్నారని 2047 నాటికి త్రీ ట్రిలియన్ ఎకనామి లక్ష్యంగా పెట్టుకొని సీఎం అడుగులు వేస్తున్నారని చెప్పారు. సుజన్ కంపెనీ ప్రతినిధి జయేందర్ తమ పరిశ్రమకు సంబంధించి, అధు నాతనమైన టెక్నాలజీకి సంబంధించిన పలు విషయాలను, తయారీ రంగం క్వాలిటీపై 40 నిమిషాల పాటు సీఎంతో తమకు ప్రదర్శించినట్లు చెప్పారు.

దేశంలో అనేకమంది ఉత్పత్తిదారులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యను దృష్టిలో పెట్టుకొని మార్కెట్లో ఎంత డిమాండ్ ఉంది, ఎంత సరఫరా ఉం ది, దానికనుగుణంగా ఎలా సప్లై చేయా లో వివరించారని, ఐవీ ప్లూయిడ్స్, గ్లోబల్ స్టాం డ్స్‌కు అనుగుణంగా అంతర్జాతీయ స్థాయి లో యంత్రాలను తీసుకొచ్చారని మంత్రి శ్రీధర్‌బాబు చెప్పారు. రాష్ట్రానికి సంబంధించిన ప్రత్యేకతలను గుర్తించి ఫార్మా, లైఫ్ సైన్స్‌కు సంబంధించిన నాలుగు ప్రధానమైన నగరాలు ఉన్నాయన్నారు.

అవి భాస్ట న్, శ్రాన్ ఫ్రాన్సిస్కో, జపాన్ కాగా, నాలుగో నగరం హైదరాబాదే ఉండడం గొప్పవిషమన్నారు. ఈ రంగంపై ప్రతి సంవత్సరం సీబీ ఆర్‌ఈ విడుదల చేసే జాబితాలో హైదరాబా ద్ ఉందని చెప్పారు. సీఎం రాష్ట్రంలో పరిశ్రమ రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నార న్నారు.

ఈ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర్‌రెడ్డి, ప్రభుత్వ చీఫ్‌విప్ పట్నం మహేందర్‌రెడ్డి, టీజీ ఐఐసీ చైర్మన్ టి.నిర్మల జగ్గారెడ్డి, ఎమ్మెల్యేలు ప్రకాష్‌గౌడ్, మల్‌రెడ్డి రంగారెడ్డి, కాలే యాదయ్య, జిల్లా పరిషత్ మాజీ చైర్‌పర్సన్‌లు పట్నం సునీత మహేందర్‌రెడ్డి, తీగల అనితా హరినాథ్‌రెడ్డి, కలెక్టర్ నారాయణరెడ్డి, టీజీఐఐసీ వైస్‌ఎండీ శశాంక (ఐఏఎస్), డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ జనరల్ షహనావాజ్ ఖాసీం, టీయూఎఫ్‌ఏడీసీ చైర్మన్ నర్సింహారెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మధుసూదన్‌రెడ్డి పాల్గొన్నారు.

క్యూర్, ప్యూర్, రేర్ అభివృద్ధికి మూడు సూత్రాలు

రాష్ట్ర అభివృద్ధిని క్యూర్(సీయూఆర్‌ఈ)(వైద్యం), ప్యూర్(పీయూఆర్‌ఈ) (పరిశుభ్రత/ కాలుష్య రహితం), రేర్(ఆర్‌ఏఆర్‌ఈ) (అరుదైన నైపుణ్యాలు) అనే మూడు సూత్రాలపై ఆధారపడి ముందుకు తీసుకెళ్తున్నామని రేవంత్‌రెడ్డి వివరించారు. దేశంలోని బల్క్ డ్రగ్స్ ఉత్పత్తిలో 40 శాతం వాటా తెలంగాణదేనని, ఈ రంగంలో ప్రపంచమే మన వైపు చూసేలా రాణిస్తున్నామని తెలిపారు.

యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం ద్వారానే నిరుద్యోగులకు ఉపాధి అవ కాశాలు లభిస్తాయని ఆయన పేర్కొన్నారు. రాబోయే పదేళ్లలో హైదరాబాద్ సమీపంలో నిర్మించబోయే ‘ఫ్యూచర్ సిటీ’లో ఉం డటం గర్వంగా చెప్పుకునేలా అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు