calender_icon.png 13 June, 2025 | 7:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాల కార్మికుల సంకెళ్లని తెంచుదాం

12-06-2025 08:07:54 PM

మందమర్రి (విజయక్రాంతి): బాల కార్మికుల సంకెళ్లని తెంచుదాం.. ప్రభుత్వానికి ఫిర్యాదు చేద్దాం అనే నినాదంతో కూడిన కరపత్రాలను సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్(Socialist Republican Association) సభ్యులు పట్టణ కూడలిలో ఆవిష్కరించారు. గురువారం పట్టణంలోని మార్కెట్ ప్రాంతంలో కరపత్రాలను ఆవిష్కరించి బాల కార్మికులపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు, అడ్వకేట్ రాజలింగు మోతె మాట్లాడారు. బాలలు, బాలకార్మిక వ్యవస్థలో మగ్గిపోతే, దేశ భవిష్యత్తు అంధకారమవుతుందన్నారు. బాలలకు తగిన విద్యాభ్యాసం, శిక్షణ అందించి విలువైన మానవ వనరులుగా తీర్చిదిద్దాలన్నారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనను ప్రభుత్వంతో పాటు సమాజం కూడా బాధ్యతగా గుర్తించాలన్నారు.

వ్యవసాయ సంస్కరణలు, ఉపాధి కల్పన పథకాలు, పేదల్లో సాంకేతిక నైపుణ్యాలు పెంపొందించటం, అవ్యవస్థీకృత రంగాలను ప్రోత్సహించటం, సహకార సంఘాల ఏర్పాటు, సాంఘిక భద్రతా పథకాల రూపకల్పన వంటి చర్యలు పరోక్షంగా బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ఉపయోగపడ తాయని అందువల్ల ప్రభుత్వం వీటిపై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర నాయకుడు, సైకాలజిస్ట్ డా,, అంబాల  సమ్మయ్య, సభ్యులు రాజు, సాయి  లు పాల్గొన్నారు.