calender_icon.png 22 December, 2025 | 8:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పిక్టోరియల్ హైదరాబాద్ సృష్టికర్త!

19-12-2025 12:00:00 AM

పోలం సైదులు :

నేడు కొర్వి కృష్ణస్వామి వర్ధంతి సందర్భంగా :

వంద సంవత్సరాల క్రితమే హైదరాబాద్ రాజ్య ప్రాముఖ్యతను ఫొటోలలో బందించి ‘పిక్టోరియల్ హైదరాబాద్’ పేరుతో రెండు ఫొటో సంపుటాలను ప్రపంచానికి అందించిన తొలి తరం జర్నలిస్టు కొర్వి కృష్ణస్వామి ముదిరాజ్. ప్రాథమిక విద్యలో మాతృభాష అని వార్యతను గుర్తించిన విద్యావేత్త. బహుజనోద్ధరణలో కుల సంఘాల స్థాపనను ప్రో త్సహించిన సంఘ సంస్కర్త.

నిజాం నిరంకుశ పాలనను వ్యతిరేకించిన జాతీయవా దిగా నిలిచారు. రాజధానిగా హైదరాబాద్‌కు మాస్టర్ ప్లాన్ రూపొందించి, అమలు పరచడానికి కృషి చేశారు. దక్షిణ భారతంలోనే అతి పెద్ద ప్రచురణాలయాన్ని స్థా పించారు. స్వయంగా అనేక గ్రంథాలను రచించారు. ఇంగ్లీషు, ఉర్దూ భాషల్లో పలు పత్రికలు నిర్వహించారు. 

రచయితగా, ప్రచురణ కర్తగా, బహుముఖ ప్రజ్ఞా పాటవాలను ప్రదర్శించి భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిగా నిలిచారు. 1893 ఆగస్టు 19న జన్మించిన కృష్ణస్వామి హైదరాబాద్‌లోని ఛాదర్‌ఘాట్ స్కూల్‌లో మెట్రిక్యులేషన్, నిజాం కళాశాలలో ఇంటర్ పూర్తి చేశారు. పోలీసు హెడ్ కానిస్టేబుల్‌గా కొన్ని రోజు లు ఉద్యోగం చేశారు. 

 తాను ఏ పని చేసినా నీతి నిజాయితీలకు మారుపేరుగా, సంఘ సంస్కర్తగా తన సేవలను కొనసాగించారు. తన ప్రతిభను చూపేందుకు జర్నలిజాన్ని ఒక సాధ నంగా మలుచుకున్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా స్వయంకృషితో బాంబే వెళ్లి ప్రింటింగ్, ఫొటోగ్రఫీ, పత్రికా నిర్వహణ, ప్రచురణ తదితర రంగాల్లో ఆధునిక శిక్షణ పొందారు. 

బహుజన సంఘసంస్కర్త..

హైదరాబాద్ గౌలిగూడలో ‘చంద్రకాం త్ ప్రెస్’ పేరిట దక్షిణ భారతంలోనే తొలి అధునాతన ప్రింటింగ్ ప్రెస్ ప్రారంభించారు. 1926లో ‘దక్కన్ స్టార్’ అనే ఆంగ్ల వార పత్రికను ప్రారంభించి సంపాదకునిగా వ్యవహరించారు. 1939లో ‘మసా వత్’ అనే ఉర్దూ వార పత్రికను ప్రారంభించారు. స్వాతంత్య్రం వచ్చాక ‘ద న్యూస్ ఎ రా’ అనే ఆంగ్ల పత్రికకు సంపాదకుడిగా పని చేశారు. రయ్యత్, ఇమ్రోజ్, సియాసత్, రహనుమా లాంటి పత్రి కలకు సామాజిక సమస్యల మీద వ్యాసా లు రాసేవారు. హైదరాబాద్ సంస్థాన చరిత్ర, సాంస్కృతిక విశేషాలను పేర్కొం టూ ‘పిక్టోరియల్ హైదరాబాద్’ పేరిట 1200 పేజీల సంపుటాలను ఉర్దూ, ఇంగ్లీ ష్ భాషల్లో వెలువరించారు.హైదరాబాద్ నగర చరిత్ర, హైదరాబాద్ మున్సిపల్ పరిపాలనా వ్యవస్థ, హైదరాబాద్ రాష్ట్రం 30 సంవత్సరాల పోరాటం, ముదిరాజ్ జాతి చరిత్ర సహా అనేక పుస్తకాలు రాశా రు. కుల, మతాలకతీతంగా హైదరాబాద్ సంస్థానంలోని సమకాలీనులతో పనిచేస్తూ అభివృద్ధికి పాటు పడటంతో తొలి తరం బహుజనుల సంఘసంస్కర్తగా కృష్ణస్వామి పేరుగాంచారు. 

గాంధీ మెచ్చిన వ్యక్తి!

సామాజిక,ఆర్థిక దోపిడీకి గురైన కుటుంబం నుంచి వచ్చిన కృష్ణస్వామి.. సమాజానికి జ్ఞానాన్ని అందించాలనే పూ లే సంస్కరణలను ఆచరించారు. స్త్రీలకు విద్య అవసరమని భావించిన కృష్ణస్వామి 1921లో పాతబస్తీలో హిందీ మీడియంలో కన్యక బాలికా పాఠశాలను ప్రారంభించారు. స్వాతంత్రోద్యమంలో భాగంగా మ హాత్మాగాంధీ హైదరాబాద్ వచ్చినప్పుడు ఈ పాఠశాలను సందర్శించడమే గాక కృష్ణస్వామి కృషిని స్వయంగా కొనియాడారు. ఆధునిక విద్య ద్వారా సామాజిక చైతన్యంతో మార్పు రావాలని ఆకాంక్షించారు. తద్వారా ఉపాధి, ఆర్థిక, రాజకీయవకాశాలు వస్తాయని వివరించారు. 1922లో మొదటిసారిగా ముదిరాజ్ సంఘాన్ని ఏర్పాటు చేసి.. తెలంగాణ వ్యాప్తంగా గ్రా మాలను సందర్శిస్తూ ఆర్థిక, సామాజిక పరిస్థితులను అధ్యయనం చేస్తూ, 90శా తం ముదిరాజులు గ్రామాల్లో అష్టకష్టాలతో జీవిస్తున్నారని గుర్తించారు. దీంతో ముదిరాజ్‌ల బతుకులు మార్చాలనే ఉద్దేశంతో దాతలను సమీకరించి, ప్రోత్స హించి ప్రత్యేక విద్యాలయాలు, హాస్టల్స్ స్థాపించారు. 1925లో జాంబాగ్ దేవాలయంలో హిందూధర్మ పరిషత్ మహాస భను స్థాపించారు.1926లో రావుబహదూర్ వెంకట్రామిరెడ్డి, మాడపాటి హను మంతరావు, పండిత నరేంద్రజీలతో కలిసి సుల్తాన్ బజార్‌లో శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం రజతోత్సవాన్ని నిర్వహించిన ఘనత ఆయనకే చెల్లింది. చట్టసభల ద్వారా మరింత సామాజిక సేవ చేయొచ్చనే ఉద్దేశంతో 1933లో ప్రత్యక్ష రాజకీ యాల్లో అడుగుపెట్టిన కృష్ణస్వామి హైదరాబాద్ నగర పాలక సంస్థలో చుడిబజార్ ప్రాంతానికి మున్సిపల్ కౌన్సిలర్ గా పనిచేశాడు. ఆ తర్వాత 1940,1955లో డిప్యూ టీ మేయర్ గా పనిచేశారు. 1957 నుంచి 1958 వరకు హైదరాబాద్ నాలుగో మేయర్ గా, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టం అవతరించాక మొదటి మేయర్‌గా కృష్ణస్వామి తన పేరును చరిత్రలో లిఖించుకున్నారు.

ప్రజాసేవకు అంకితం..

హైదరాబాద్ మేయర్‌గా ఉన్నకాలంలో హైదరాబాద్‌కు మాస్టర్ ప్లాన్ రూపొందించి నగరంపై చెరగని ముద్రవేసి, భవి ష్యత్ తరాలకు మార్గదర్శకుల య్యారు. ఆయన చేతిలో ఉన్న అధికారంతో నగరంలో మనిషిలాగే రిక్షాను రద్దు చేసి, దాని పై ఆధారపడి జీవనం కొనసాగించే వారికి మరో ఉపాధి కల్పించారు. అంతేకాదు నగర మేయర్‌గా కాలినడకన కార్యాలయానికి వెళ్లేవారు. ఇలా దాదాపు 30 సంవ త్సరాలు రాజకీయ జీవితంలో కొనసాగారు. 1960లో బ్యాక్ వర్డ్ క్లాస్ అసోసి యేషన్ ఏర్పడటానికి కారణమయ్యారు. ఆయన విభిన్న రంగాలైన పాత్రికేయం, రచన, విద్యావేత్త, స్వాతంత్ర సమరయోధుడు, బహుభాషావేత్త, బహుముఖ ప్రజ్ఞాశాలి, ముదిరాజ్ సంఘం తొలివ్యవస్థాపక అధ్యక్షుడిగా, హైదరాబాద్ నగర తొలి మేయర్ గా సేవలందించారు. డిసెంబర్ 19, 1967లో మరణించారు. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే తన మేధాశక్తితో, వ్యాపార లక్షణాలతో, ఆయనకున్న పరిచయాలతో, రాజకీయ పదవుల ద్వారా లక్షల ఆస్తులు సంపాదించే అవకాశమున్నప్పటికీ ఆ మార్గాన్ని ఏంచుకోలేదు. కాగా కృష్ణస్వామి మరణం అనంతరం ఆయన దహన సంస్కారాలకు చిల్లి గవ్వ లేకపోవడంతో అతడి మిత్రులంతా కలిసి కార్య క్రమం నిర్వహించారు. రాజకీయాలంటే ఆస్తులు సంపాదించుకుంటూ, తరతరాలకు మూటకట్టుకోవడం కాదని, నిస్వా ర్థంగా ప్రజాసేవకు అంకితం కావడమేనని ఆచరణలో సుసాధ్యం చేసిన మహానుభావుడు. సమాజసేవకే తన జీవితాన్ని అంకి తంచేసిన ఆ మహానుభావుడి జయంతి, వర్ధంతి వేడుకలను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహిస్తూ, పత్రిక, రచన, సేవ, రాజకీయ రంగాల్లో ప్రావీణ్యం కలిగినవారికి ఆయన పేరిట అవార్డులు ఇవ్వాల్సిన అవసరం ఉంది.యావత్తు జాతి కొర్వి కృష్ణస్వామి అడుగుజాడల్లో నడవాలని ఆశిద్దాం.

 వ్యాసకర్త సెల్: 9441930361