calender_icon.png 17 August, 2025 | 7:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దామాషా పద్ధతిలో ఎదుగుదాం

20-06-2024 12:05:00 AM

హైదరాబాద్ జిల్లా మహారాజ్‌గంజ్ నియోజకవర్గం నుండి ఎన్.లక్ష్మీనారాయణ ముదిరాజ్ 1972లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికయ్యారు. ప్రతిష్ఠాత్మకమైన హైదరాబాద్ మేయర్‌గా కూడా ఆయన పనిచేశారు. మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్ నియోజకవర్గం నుండి డాక్టర్ జి.నర్సింహులు నాయుడు 1978, 1983లలో కాం గ్రెస్ అభ్యర్థిగా రెండు పర్యాయాలు విజయం సాధించారు. రంగారెడ్డి జిల్లా తాండూర్ నియోజకవర్గం నుండి ఎం. చంద్రశేఖర్ 1985, 1989 సంవ త్సరాల్లో రెండుసార్లు కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు. నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి, కోట్ల విజయభాస్కర్‌రెడ్డిల మంత్రివర్గంలో పనిచేశారు. హైద రాబాద్‌లో ప్రముఖ కాంగ్రెస్ నాయకుడిగా పేరొందిన కె.ఎస్.నారాయణ ముదిరాజ్ 1977, 80 సం వత్సరాలలో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ, నరేంద్ర లను ఓడించి ఎంపీగా ఘన విజయం సాధించారు.

పార్లమెంట్‌లో అడుగుపెట్టిన తొలి ముదిరాజ్ గా కూడా నారాయణ ఖ్యాతి గడించారు. మూడున్నర దశాబ్దాలకుపైగా రాజకీయ జీవితం గడిపిన కె.ఎస్. నారాయణ సికింద్రాబాద్ కాంగ్రెస్ రాజకీయాలలో ప్రధాన ప్రాత పోషించారు. మహ బూబ్‌నగర్ జిల్లా అసెంబ్లీ నియోజకవర్గం నుండి పొడిపాటి చంద్రశేఖర్ 1983, 1985, 1994, 1999 సంవత్సరాలలో నాలుగు పర్యాయాలు మహబూబ్‌నగర్ నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా గెలుపొందారు. ఎన్టీఆర్ హయాంలో పంచాయితీ, రవాణా శాఖలను, చంద్రబాబు ప్రభుత్వంలో భారీ పరిశ్రమలు, న్యాయశాఖ మంత్రిగా పీసీఆర్ పని చేశారు. ఇటీవలే ఆయన తెదేపాకు రాజీనామా చేసి టీఆరెస్ (బీఆరెస్)లో చేరారు. ఇదే జిల్లా వనపర్తి నియోజకవర్గం నుండి డా.బాలకృష్ణయ్య టీడీపీ అభ్యర్థిగా 1983, 85లలో రెండు పర్యాయాలు గెలుపొందారు. అలాగే, మహబూబ్‌నగర్ నియోజకవర్గం నుండి అంజనేయులు ముదిరాజ్ కాంగ్రె స్ అభ్యర్థిగా శాసనసభకు ఎన్నికయ్యారు.

మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా ఎం. సత్యనారాయణ అలియాస్ ఎర్ర సత్యం 1994లో జరిగిన ఎన్నికల్లో కాం గ్రెస్ అభ్యర్థిపై ఘన విజయం సాధించారు. శాసనసభ్యుడిగా వుండగానే సత్యం హత్యకు గురవడంతో 1996లో జరిగిన ఉపఎన్నికల్లో ఆయన సోదరుడు ఎం.చంద్రశేఖర్ (ఎర్ర శేఖర్) కాంగ్రెస్ అభ్యర్థిపై విజ యం సాధించారు. 1999లో జరిగిన ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుండి గెలుపొందారు. 2009లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా తిరిగి విజయం సాధించారు. మెదక్ జిల్లా జహీరాబాద్ నియోజక వర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా సి.భాగన్న 1994 ఎన్నికల్లో గెలుపొందారు.

రంగారెడ్డి జిల్లా తాండూర్ నియోజక వర్గం నుండి నారాయణరావు ముదిరాజ్ 2004లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు. 2004లో కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజక వర్గం నుంచి ప్రత్యేక రాష్ట్రం కోసం ఏర్పడిన టీఆర్‌ఎస్ అభ్యర్థిగా ఈటల రాజేందర్ గెలుపొందారు. జడ్చర్ల నియోజక వర్గం నుండి ఎం. చంద్ర శేఖర్ ముదిరాజ్ (ఎర్రశేఖర్) గెలుపొందారు. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజ్‌గిరి నుండి కాంగ్రెస్ అభ్యర్థి ఆకుల రాజేందర్ విజయం సాధించారు. వీరు గాక కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ రంగారెడ్డి జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షులుగా 2001లో ఎన్నికయ్యారు.

2007లో ఎం.ఎల్.సి. స్థానానికి ఇండిపెండెంట్‌గా పోటీ చేసి విజయం సాధించారు. మహబూబ్‌నగర్ జిల్లా పరిషత్ చైర్మ న్ వెంకటయ్య ముదిరాజ్ టీడీపీ తరపున గెలుపొందారు. అలాగే, ముదిరాజ్ మహాసభ వ్యవస్థాప కులు కొర్వి కృష్ణస్వామి ముదిరాజ్ కూడా హైదరాబాద్ 2వ మేయర్‌గా పని చేసి ప్రముఖుల మన్న నలను అందుకుని జనరంజక పాలకుడిగా ఖ్యాతికెక్కారు. 2006 తర్వాత కాంగ్రెస్ పార్టీ కాసాని జ్ఞానే శ్వర్ ముదిరాజ్, మాణిక్యరావు ముదిరాజ్‌లకు ఎం.ఎల్.సి.లుగా అవకాశం కల్పించి చేతులు దులుపుకుంది. 2014లో తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం నుండి ఈటల రాజేందర్ టీఆర్‌ఎస్ పార్టీ నుండి ఎన్నికైనారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఆర్ధిక, పౌర సంబంధాల శాఖా మాత్యులుగా కొనసాగారు. తొలి తెలంగాణ రాష్ట్రం లో ఏకైక ఎమ్మెల్యేగా ఈటల రాజేందర్ నిలిచిపోయారు. 

ఏదేమైనప్పటికీ అన్ని రాజకీయ పార్టీలు ముదిరాజ్‌లకు జనాభా ప్రాతిపదికన రాజకీయ భాగస్వా మ్యం కల్పించడం లేదు. ఆరున్నర దశాబ్దాలుగా తమ అవకాశాలను తన్నుకు పోయి అనుభ విస్తు న్న అగ్రవర్ణ దురహంకారానికి ముదిరాజ్‌లు చరమగీతం పాడే రోజు అతి దగ్గరలోనే వుంది. రాష్ట్రం లో 60కి పైగా నియోజక వర్గాల్లో ముదిరాజులు రాజకీయ ఐక్యత ప్రదర్శించి తమ ఓట్లు తాము వేసుకున్నా గెలిచే శక్తి వుంది. దాదాపు 52 నియోజక వర్గాల్లో రాజకీయ పార్టీ అభ్యర్థుల గెలుపు ఓట ములను నిర్ణయించే స్థితిలో ముదిరాజ్‌లు వున్నా రు. కనుక రానున్న కాలంలోనైనా రాజకీయ పార్టీ లు ముదిరాజ్‌ల ప్రాధాన్యతను గుర్తించి వారికి తగిన సీట్లు కేటాయించాలి. లేని పక్షంలో ముదిరాజ్‌ల అగ్రహానికి ఆయా పార్టీలు గురై తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం 10 జిల్లాలలో గ్రామస్థాయి నుండి రాష్ట్రస్థాయి వరకు ఆత్మబలిదానాలతో ఉద్యమానికి ఊపిరి పోసి అమ-రులైన ముదిరాజ్ బిడ్డలు ఎందరో. ప్రజాసంఘాలను ఉద్యమబాటలో నడపడంలో చురుకైన నాయక త్వం ఉన్నప్పటికినీ 2014లో జరిగిన శాసనసభ ఎన్నికలలో అన్ని రాజకీయ పార్టీలు 9% ఉన్న ముదిరాజ్ కులస్థులకు శాసనసభ టికెట్లు కేటాయించక పోవడం బాధాకరమైన విషయం. ఇంత కాలం వివక్షకు, రాజకీయ అంటరానితనానికి గురై న ముదిరాజ్‌లు భవిష్యత్తు తరాలకు కులం, ఆర్థిక, సాంఘిక, రాజకీయ, సాంస్కృతిక, ఉద్యోగ, ఉపాధి రంగాలలో ‘ముదిరాజ్ అధ్యయన వేదిక’ సూచన ల మేరకు ముందుకు సాగడానికి చేస్తున్న కృషిని వినియోగించుకోవాలి. రానున్న ఎన్నికల నాటికైనా అన్ని పార్టీలలో దామాషా ప్రాతిపదికన ముదిరాజ్‌లు ప్రజాప్రతినిధులుగా ఎదుగుతారని ఆశిద్దాం.

 పల్లెబోయిన అశోక్,

ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ముదిరాజ్ మహాసభ