calender_icon.png 31 January, 2026 | 9:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యుత్ బిల్లు క్రమం తప్పకుండా చెల్లించండి

31-01-2026 07:52:50 PM

వినియోదారులను సూచించిన డిఈ చంద్రమౌళి 

జడ్చర్ల: వినియోగదారులు క్రమం తప్పకుండా విద్యుత్ బిల్లులను చెల్లించాలని డిఈ చంద్రమౌళి అన్నారు. మండలం పెద్దపల్లి   గ్రామంలో విద్యుత్ శాఖ పల్లెబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామ సర్పంచ్ నాగసాల శ్రీనివాసులు అధ్యక్షతన గ్రామంలో నెలకొన్న విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం రానున్న వేసవి కాలంలో విద్యుత్ సమస్యలు ఏర్పడకుండా  చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమం లో ఎడిఈ చంద్రశేఖర్, ఎఈ వెంకటేష్,లైన్ మెన్ జాషువా, ఉప సర్పంచ్ బాల్ రెడ్డి, వార్డ్ మెంబర్స్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు బుక్క వెంకటేష్, నర్సింహ చారి, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.