calender_icon.png 31 January, 2026 | 9:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతి ఉద్యోగికి పదవీ విరమణ తప్పనిసరి

31-01-2026 08:08:44 PM

రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): ప్రతి ఉద్యోగికీ పదవీ విరమణ తప్పనిసరి అని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేరుకొన్నారు. వేములవాడ అర్బన్ మండలం అగ్రహారం ఆంజనేయ స్వామి ఈవో నాగారపు శ్రీనివాస్  పదవీ విరమణ చేస్తున్న సందర్భంగా నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. ఆంజనేయ స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

వారు మాట్లాడుతూ శ్రీనివాస్ గత 36 సంవత్సరాల నుంచి దేవాదాయ శాఖలో పంచలంచెలుగా పనిచేస్తూ ఈఓ స్థాయికి ఎదిగారని అన్నారు..రిటైర్మెంట్ అయినారు ప్రతి ఉద్యోగి ఉద్యోగ కాలంలో చేసిన  మంచి పనులు పేరు ప్రతిష్టలు నిలబెడతాయి అని అన్నారు.నాగారం శ్రీనివాస్ ఆంజనేయ స్వామి దేవస్థానం అభివృద్ధి పరచడంలో విశేష కృషి చేశారని,రిటైర్మెంట్ తర్వాత కూడా వారి సేవలో అవసరమైనచో  సూచనలు సలహాలు మిగతా సిబ్బందికి అందించాలని సూచించారు..

సీఎం రేవంత్ రెడ్డి  ఆధ్వర్యంలో వేములవాడ రాజరాజేశ్వర దేవస్థానాన్ని టెంపుల్ సీటీ గా అభివృద్ధి చేస్తున్నాం అన్నారు.. గతంలో దేవస్థాన ఛైర్మన్గా పనిచేసిన సందర్భంగా  నాంపల్లి దేవస్థానాన్ని,మామిడిపల్లి సీత రామ చంద్ర స్వామి వారి ఆలయాన్ని అభివృద్ధి చేశానని ప్రస్తుతం రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేయడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని అన్నారు..శ్రీనివాస్ జీవితం శేష జీవితం ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు..