20-06-2024 12:05:00 AM
ఆర్‌టీఐ చట్టం కింద అవినీతిని ప్రశ్నించడమే దేవకీనందన్ శర్మ చేసిన తప్పా? ఈ పోరాటంలో భాగంగా ఆమరణ దీక్షకు దిగిన ఆయన చివరికి మృత్యువు ఒడికి చేరాడు. ఇంతకాలం పట్టించుకోని అధికారులు ఇప్పుడు ఆయన మృతికి బాధ్యత వహిస్తారా?
ఆమరణ దీక్ష తర్వాత చనిపోతే దాన్ని ‘మరణం’ అనవచ్చా? ఒకవేళ ఆ మరణానికి కారణం ప్రభుత్వ అధికారుల అవినీతి, అక్రమాలకు సంబంధించినదైన పక్షంలో సదరు ‘ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు’ వారిలో ఎవరినైనా శిక్షించవచ్చా? ఏ విధంగా చూసినా వాస్తవికంగా కాకపోయినా దాన్ని హత్యగానే అభివర్ణించవచ్చు. ఆమరణ నిరాహారదీక్ష తర్వాత చనిపోయిన దేవకీ నందన్ శర్మ మృతికి ఎవరు బాధ్యులు? 60 ఏళ్ల దేవకీ నందన్ శర్మ అవినీతికి వ్యతిరేకంగా నాలుగు నెలలపాటు నిరాహార దీక్ష చేసిన అనంతరం తుదిశ్వాస విడిచాడు. తమ గ్రామంలో నలుగురు మాజీ ప్రధాన్ (సర్పంచ్)ల పదవీ కాలంలో చేసిన పనులపై దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేస్తూ ఆయన నిరాహార దీక్షకు దిగాడు. 2012 నుంచి చివరిశ్వాస విడిచే వరకు వివిధ ప్రభుత్వ శాఖలతో జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాలకు సంబంధించిన డాక్యుమెంట్ల సాక్ష్యాలను కూడా ఆయన ఇదివరకే సేకరించాడు. ఆయన వద్ద 160 పేజీల డాక్యుమెంట్లు ఉన్నాయి.
ఎవరు కూడా ఆయన ఉత్తరాలకు స్పం దించలేదు. బ్లాక్ డెవలప్‌మెంట్ అధికారి (బీడీఓ) మొదలుకొని రాష్ట్రపతి వరకు ఎవరికి కూడా సమాధానం చెప్పే సమ యం లేకపోయింది. కాదంటే, అది తమకు చేరలేదనో లేదా సరైన విధంగా పోస్టు చేయ లేదనో లేదా ఎక్కడో పోయి ఉం టుందనో సమాధానం ఇచ్చేవారు. అయి తే, అతని ‘నిశ్శబ్ద మరణం’ గురించి మాత్రం తాము రామరాజ్యంలో ఉన్నామ ని ఎవరు కూడా చెప్పుకోలేరు. ఈ ఏడాది ఫిబ్రవరి12న తన ఇంట్లో భాగంగా ఉన్న ఓ ఆలయంలో దేవకీ నందన్ తన ఆమర ణ నిరాహారదీక్షను ప్రారంభించాడు. ఆయనకు 16 ఏళ్ల కుమార్తె, భార్య ఉన్నారు.
పోస్టుమార్టమ్‌లో గుండెపోటు
దేవకీ నందన్ ఉత్తరప్రదేశ్‌లోని మథుర జిల్లా మంత్ తాలూకాలోని శంకర్‌గర్హి గ్రామ నివాసి. ‘స్వచ్ఛ భారత్ మిషన్’ కింద చేపట్టిన మరుగుదొడ్లు లాంటి గ్రామంలోని గ్రామీణాభివృద్ధి పనుల్లో చోటు చేసుకున్న అవకతవకలపై ఆయన గత 13 ఏళ్లుగా అవిశ్రాంతంగా పోరాడుతున్నాడు. ఆసక్తికర విషయం ఏమిటంటే ‘ఆయన మరణానికి కారణం గుండెపోటు’ అని పోస్టుమార్టమ్ నివేదిక పేర్కొంది. దాదాపు గా అన్ని మరణాలకు కారణం గుండెపో టు అని సాధారణంగా అందరు డాక్టర్లు, పోలీసు అధికారులు చెబుతూనే ఉంటా రు. పోలీసులు ఆ విషయాన్ని రికార్డు చేశా క మరణానికి అసలు కారణం ఏమిటో నిర్ధారించుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. ‘సమాచార హక్కు చట్టం’ కింద సమాచారం కోరడమే అతని మరణానికి కారణమని లేదా స్వచ్ఛందంగా ప్రాణం తీసుకునేలా చేయడం ద్వారా ‘మరణాన్ని ప్రేరేపించార’ని చెప్పేందుకు సంబంధింత ప్రభుత్వ శాఖలు సాహసించగలవా?
అడగడమే తప్పా?
‘స్వచ్ఛ భారత్ మిషన్’ కింద చేపట్టిన పనుల్లో జరిగిన అవకతవకలను దేవకీ నందన్ ప్రశ్నించాడు. అది మరుగుదొడ్ల నిర్మాణానికి సంబంధించింది. దీనికోసం మంజూరయిన సొమ్మును అవినీతి అధికారులు తమ వాటాల్లో భాగంగా పంచేసు కున్నారు. దీనికి సంబంధించిన వివిధ డాక్యుమెంట్లలోని సమాచారాన్ని పొంద డం కోసం ఆయన తరచూ సమాచార హక్కు(ఆర్‌టీఐ) చట్టాన్ని ఉపయోగించుకునే వారు. ‘సత్యమేవ జయతే’ (సత్యమే జయిస్తుంది) అని నమ్మే మన దేశంలో ఆయన మరణానికి కారణం ఆర్‌టీఐ అని కొందరు మీడియా ప్రతినిధులైనా (పోలీసులు, డాక్టర్లు కాదు) చెప్పగలరా? ఆయ న మరణ వార్తను ప్రపంచానికి తెలియజేసింది ఘజియాబాద్‌లోని జితేంద్ర అనే ఓ చార్టర్డ్ ఇంజినీర్. తరచూ ‘సమాచార హక్కు చట్టం’ కింద ప్రశ్నలతో తమను విసిగిస్తున్నందుకు ప్రభుత్వ అధికారులు, ‘సమాచార హక్కు చట్టం’ కింద పని చేసే ప్రజా సంబంధాల అధికారులు (పీఐఓ)లు దేవకీ నందన్‌ను బెదిరించడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. ప్రశ్నలు అడిగేవారు ఆర్‌టీఐతో దెబ్బకొడుతుంటారని చాలామంది అభివర్ణిస్తుంటారు.
దీక్ష విరమించమని బెదిరింపులు
“నిరాహార దీక్ష చేసిన ఇన్ని నెలల సమయంలోను ఆయన కేవలం మంచినీళ్లు లేదా నిమ్మరసం తీసుకునే వారు. బీడీలు కాల్చేవారు. ఆయన చాలా బలహీనంగా తయారయ్యారు. మాట్లాడలేని స్థితికి చేరుకున్నారు. అయినా అధికారులు ఎవరూ పట్టించుకోలేదు. జూన్ 10న మాత్రం అధికారులు మా ఇంటికి వచ్చి, నిరాహార దీక్ష విరమించకుంటే చట్టపరమైన చర్య తీసుకుంటామని బెదిరిస్తూ ఓ నోటీసును మాత్రం అంటించారు” అని దేవకీ నందన్ సతీమణి సుధాశర్మ తన భర్త మరణం గురించి వివరిస్తూ ఆవేదనతో చెప్పారు. దేవకీ నందన్ నిరాహార దీక్ష చేస్తున్న గుడి తలుపులకు సబ్ డివిజినల్ మేజిస్ట్రేట్ (ఎస్‌డీఎం)పేరిట ఈ నోటీసును అంటించారు.
గ్రామాన్ని ఎంతో ప్రేమించేవారు
ఉత్తరప్రదేశ్ నీటిపారుదల శాఖలో ఇంజినీర్ కుమారుడయిన దేవకీ నందన్ తన తండ్రి మరణం తర్వాత మథుర నగ రం నుంచి గ్రామానికి మారాడు. ‘తన గ్రామాన్ని ఎంతగానో ప్రేమిస్తానని, గ్రామం అభివృద్ధి చెందితే చూడాలన్నదే తన కల’ అని ఆయన ఎప్పుడూ చెప్పేవా డు. మొదట్లో ఆయన ప్రతి దానికి కోపం తెచ్చుకునే వాడు. దాని కారణంగా అనేక వివాదాలు కూడా తలెత్తాయి. అవినీతిపై దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేస్తూ ఆమరణ దీక్ష చేపట్టిన దేవకీ నందన్ దురదృష్టవశాత్తు జూన్ 14న తుదిశ్వాస విడి చాడు. మరి, అతని మరణానికి దోషి ఎవరనేది అసలు ప్రశ్న. ఈ ప్రశ్నకు ఎవరు సమాధానం చెబుతారు?
ఇప్పుడు మాకెవరు దిక్కు?
“ఆయన చాలా మొండి పట్టుదల గల మనిషి. ఇన్నేళ్లుగా గ్రామం కోసం జరిపిన పోరాటంలో ఆయన సర్వ స్వం కోల్పోయారు. సమాజ సేవ కోసం చివరికి తన అయిదు బిఘాల భూమి ని కూడా అమ్మేశారు. ఆయన నా కోసం ఏమీ మిగల్చలేదు. నా కుమార్తెతో నేను ఎలా బతకాలో అర్థం కావ డం లేదు” అని కూడా సుధాదేవి వాపోయారు.గ్రామంలో కిరాణా కొట్టు నడుపుతూ సుధాదేవి తన భర్తకు చేదోడు వాదోడుగా ఉండేది. ఇప్పుడు ఆమె దిక్కులేనిదైంది.
(‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ సౌజన్యంతో)