28-05-2025 08:40:55 PM
జాజిరెడ్డిగూడెం/అర్వపల్లి: జాజిరెడ్డిగూడెం మండల నూతన తహశీల్దార్(New Tahsildar)గా బాషపాక శ్రీకాంత్ బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఈయన జిల్లా కేంద్రం సూర్యాపేటలోని రాజస్వ మండలాధికారి కార్యాలయంలో డిఏఓగా విధులు నిర్వర్తిస్తూ బదిలీపై ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా నూతన తహశీల్దార్ మాట్లాడుతూ... మండలంలో రెవెన్యూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. రెవెన్యూ సిబ్బంది తమ విధుల పట్ల బాధ్యతగా వ్యవహరిస్తూ, ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యలు పరిష్కరించాలన్నారు.