calender_icon.png 30 May, 2025 | 4:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామ పంచాయతీ కార్యాలయానికి భూమి విరాళం

28-05-2025 08:43:06 PM

సారంగాపూర్ (విజయక్రాంతి): మండలంలోని అడెల్లి గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి గ్రామానికి చెందిన తాండ్ర రాజేశ్వర్(డీలర్) లక్ష్మవ్వలు తన భూమిని బుధవారం విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీవో అజీజ్ ఖాన్(MPO Aziz Khan), గ్రామ నాయకులు, గ్రామస్తులు వారిని ఘనంగా సత్కరించారు. ఎంపీఓ అజీజ్ ఖాన్ మాట్లాడుతూ... గ్రామ అభివృద్ధికి తన భూమిని విరాళంగా అందించడం అభినందనీయమని అభినందించారు. ఈ కార్యక్రమంలో డిటి రవీందర్ సెక్రటరీ రజిత ఆలయ చైర్మన్ సింగం భోజ గౌడ్ విడిసి అధ్యక్షుడు శేఖర్ గౌడ్ దండు సాయన్న రాము లక్ష్మీనారాయణ గౌడ్ లక్ష్మణ్ రాము తదితరు గ్రామస్తులు పాల్గొన్నారు.