calender_icon.png 11 December, 2025 | 12:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముగిసిన మావోయిస్టు అగ్ర నాయకుడు ఆనంద్ అంత్యక్రియలు

10-12-2025 09:01:02 PM

అశ్వాపురం (విజయక్రాంతి): మండలానికి చెందిన మావోయిస్టు అగ్ర నాయకుడు ఆనంద్ అనారోగ్యంతో స్వగ్రామం చింత్రియాలలో మృతిచెందారు. సుమారు నాలుగు దశాబ్దాల పాటు మావోయిస్టు పార్టీలో పనిచేసిన ఆయన ఇటీవలే అరెస్టయి వృద్ధాప్యంతో బాధపడుతున్నారు. పార్టీలో అనంద్ గా పేరొందిన ఆయన అసలు పేరు తోట సీతారామయ్య. చీరాలలో బీఎస్‌సీ చదువుకుంటున్నప్పుడు రాడికల్ విద్యార్థి సంఘంలో భాగమయ్యారు. 1980లో పూర్తికాలం కార్యకర్తగా పనిచేశారు. మొదటగా ఆర్గనైజేషన్ రంగంలో పనిచేశారు. 1986లో పీస్ బుక్ సెంటర్ మూత పడ్డాక పీపుల్స్ వార్ కేంద్ర కమిటీ, ఏపీ రాష్ట్ర కమిటీ స్టాప్‌లో భాగంగా పట్టణాలలో పనిచేశారు.

నిర్బంధం కారణంగా పట్టణాల్లో పనిచేయలేని పరిస్థితుల్లో ఆనంద్ కేంద్ర కమిటీ పనుల్లో భాగంగా 1995 తర్వాత దండకారణ్యానికి వచ్చారు. సీసీ వాళ్ళ డాక్యుమెంట్స్ టైపింగ్, కరెక్షన్స్ ఇంకా సర్క్యులర్స్ టైపింగ్స్ అన్నీ ఆనందే చేసేవాడు. పీపుల్స్ వార్, అనంతరం మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి గణపతి (ముప్పాల లక్ష్మణ రావు) వద్ద చాలాకాలం పనిచేశారు. మితంగా మాట్లాడే ఆయన దశాబ్దల పాటు అజ్ఞాతంలో పనిచేశారు. తీవ్రమైన అనారోగ్య సమస్యతో, ట్రీట్ మెంట్ కోసం వచ్చి హైదరాబాద్‌లో 2023లో అరెస్టు అయ్యారు. ఆ తరువాత బెయిల్‌పై ఇంటికి వచ్చారు. తాజాగా ఆయన మృతిచెందడంతో వామపక్ష నేతలు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆనంద్‌ మృతికి సంతాపం ప్రకటిస్తున్నారు. అంత్యక్రియలలో ఆరుణ పతాకం కప్పి నివాళి అర్పించారు.