10-12-2025 10:06:57 PM
ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు..
బెజ్జూర్ (విజయక్రాంతి): బెజ్జూర్ మండల కేంద్రంలోని కాపువాడలో సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాపువాడలోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గతంలో రోడ్డు నిర్మించినప్పుడు ఇల్లు పోయాయని ఇప్పటివరకు మాకు ఇల్లు ఇవ్వలేదని ప్రజలు సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లడంతో వారు ఇల్లు కట్టుకునే వారికి ఇండ్లు ఇచ్చి తీరుతామని తెలిపారు.
మురికి కాలువలు సీసీ రోడ్లు మంజూరు చేయిస్తానని కాలనీని అన్ని విధాల అభివృద్ధి చేయిస్తానని కాలనీ ప్రజలకు హామీ ఇచ్చారు. పెన్షన్ రావడం లేదని ఓ కుటుంబం ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లడంతో పెన్షన్ వచ్చేలా చూస్తానని ఆ కుటుంబానికి భరోసనిచ్చారు. సర్పంచ్ అభ్యర్థి జ్యోతిలక్ష్మి కత్తెర గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే గ్రామంలోని సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని తెలిపారు. గ్రామం అన్ని విధాల అభివృద్ధి కావాలంటే ఒక్కసారి సర్పంచుగా అవకాశం ఇవ్వాలని కోరారు.