10-12-2025 10:01:49 PM
సిర్పూర్ శాసనసభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు పిలుపు..
బెజ్జూర్ (విజయక్రాంతి): మండలంలోని పాపన్ పేట, హేటిగూడ, గోల్కొండ, ఎల్కపల్లి, అందుగులగూడ సర్పంచ్ అభ్యర్థులు దందెర శ్రీదేవి విలాస్, దుర్గం జ్యోతి లక్ష్మీ, తలాండి సమీర ఈశ్వర్ కు మద్దతుగా ప్రచారం సిర్పూర్ శాసన సభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల ప్రాథమిక పాఠశాలను హైస్కూల్ గా అప్ గ్రేడ్ చేశామని, చదువుకున్న వ్యక్తిని సర్పంచ్ గా గెలిపిస్తే గ్రామం అభివృద్ధి పథంలో నడుస్తుందని తెలియజేశారు.
గత పది సంవత్సరాలుగా సర్పంచ్ గా ఉన్న వాళ్ళు గ్రామ పంచాయతీ నిధులను ఎలా దుర్వినియోగం చేశారో మీరందరూ చూశారని, అధికార మదంతో ప్రజలపై నానా కేసులు పెట్టీ ఇబ్బందులకు గురి చేశారని అన్నారు.ఈ కార్యక్రమంలో సిర్పూర్ అసెంబ్లీ కన్వీనర్ గొల్లపల్లి వీరభద్ర చారి, మండల అధ్యక్షులు జాడి తిరుపతి, మాజీ ఎంపిపి కోండ్ర మనోహర్ గౌడ్, కొప్పుల శంకర్, మంజుల, మెస్రం రాజారాం, సామల తిరుపతి, రమేష్, మన్కయ్య, దిగంబర్, మహేష్, చంటి, పొన్న ప్రవీణ్, బాపు వార్డు మెంబర్లు పాల్గొన్నారు.