calender_icon.png 11 December, 2025 | 12:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్రమంగా తరలిస్తున్న మద్యం బాటిళ్లు పట్టివేత..

10-12-2025 08:33:55 PM

బేల (విజయక్రాంతి): ఎన్నికల కోడ్ అమలు సందర్భంగా అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నారు. బుధవారం మండల కేంద్రంలో తనిఖీలు చేస్తుండగా కుడ్మేత జంగు, పెందుర్ దేవిదాస్ లు మద్యం బాటిల్ తో పట్టుబడ్డారు. వీరిద్దరూ మద్యం బాటిల్ తరలించగా ఎన్నికల ఫ్లైయింగ్ స్కాడ్ టీమ్ అధికారి సిడం వామన్ పట్టుకొని స్థానిక పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. దాదాపుగా 95 మద్యం సీసాలను పట్టుకున్నామని, దీని విలువ సుమారుగా రూపాయలు 10,450 లు ఉంటుందని పేర్కొన్నారు. మోడల్ కోడ్ అఫ్ కండక్ట్ అమలులో ఉన్నందున ఎన్నికల సమయంలో ఎవరైనా మద్యం, డబ్బులు తరలిస్తే అలాంటి వారి పైన కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ఈ తనిఖీలో బేల ఎస్ఐ ప్రవీణ్ కుమార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ సాజీద్ తదితరులు పాల్గొన్నారు.